27.7 C
Hyderabad
April 26, 2024 06: 58 AM
Slider నల్గొండ

ఉన్నత చదువులు చదివి సొంత ఊరుకు తరలివచ్చి….

#TRS Nereducherla

ఉన్నతమైన చదువులు చదివి, విదేశాలలో విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని సొంత ఊరుకు తరలివచ్చింది ఆమె. ఉన్న ఊరు కన్నతల్లితో సమానమని, సేవే లక్ష్యంగా భావించి తన సొంత ఊరును, ప్రాంతాన్ని,అభివృద్ధి చేయాలనే ధృడ లక్ష్యంతో రాజకీయాల్లో  ప్రవేశించినట్లు చెప్పారు శ్రీలత రెడ్డి.

ఆమె సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలం వాసి. ప్రజలకు సేవ చేస్తున్న తరుణంలో మున్సిపాలిటీ ఎన్నికలు రావడంతో తాను చేయాలనుకున్న అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో చేయాలంటే, తన సంకల్పం నెరవేరాలంటే ఏదైనా ఒక పదవి ఉండాలని భావించి  రాష్ట్రంలోనే మున్సిపాలిటీ చైర్మన్ “జనరల్ మహిళ” కావాలని కోరుకున్న వ్యక్తి శ్రీలలిత రెడ్డి.

రిజర్వేషన్ అనుకూలించక పోయినా కౌన్సిలర్ గా పోటీచేసి, విజయం సాధించి మున్సిపల్ వైస్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి  ప్రజలకు ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు, పార్టీ పట్ల ఆమెకు ఉన్న అంకితభావాన్ని గుర్తించి, ఇలాంటి వ్యక్తి పట్టణ పార్టీ అధ్యక్షురాలిగా ఉంటే పార్టీ బలోపేతం అవుతుందని, ప్రభుత్వ ఫలాలు ప్రజలకు చేరుతాయని ఆశించారు.

ఆమె కన్న కలలు సఫలం అవుతాయని నేరేడుచర్ల టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలుగా నియమించారు. నేరేడుచర్ల టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైన మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శ్రీలత రెడ్డి ప్రజలతో మమేకమై,ప్రజా ఉపయోగ అభివృద్ధి పనులను నెరవేర్చి,ప్రజా మన్ననలను పొందుతారని ఆశిద్దాం.

Related posts

కానిస్టేబుల్ యూనిఫామ్ పోస్టులకు వయోపరిమితి 5 సంవత్సరాలు పెంచాలి

Satyam NEWS

ఉత్తమ గ్రామ పంచాయతీగా వాజిద్ నగర్

Satyam NEWS

సూడో ఐఏఎస్:పెళ్లిపేరుతో అమ్మాయిలకు వల

Satyam NEWS

Leave a Comment