28.7 C
Hyderabad
April 27, 2024 05: 08 AM
Slider జాతీయం

లద్దాక్ ప్రాంతంలో అరుదైన రికార్డు సాధించిన బిఆర్ఓ

#boarder road corporation

ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో వాహనాలు వెళ్లేందుకు వీలైన రోడ్డు నిర్మించిన ఘనత భారత్ సొంతం చేసుకున్నది. సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎత్తున తూర్పు లద్దాక్ ప్రాంతంలోని ఉమ్ లిగ్లా ప్రాంతంలో ఈ రోడ్డు నిర్మాణం జరిగింది.

ఈ ప్రాంతంలో సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ (బిఆర్ఓ) 52 కిలోమీటర్ల మేరకు ఈ రోడ్డు నిర్మించింది. తూర్పు లద్దాక్ ప్రాంతాన్ని ఈ రోడ్డు చుమ్మార్ సెక్టార్ తో అనుసంధానం చేస్తుంది. ఈ రహదారి నిర్మాణం అక్కడి ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భారత సైనికాధికారులు తెలిపారు.

లేహ్ ప్రాంతంలో పర్యాటకాన్ని అభివృద్ధి పరచేందుకు కూడా ఈ రోడ్డు ఉపకరిస్తుందని భారత సైనికాధికారులు వివరించారు.

ఈ ప్రాంతంలో శీతాకాలంలో ఇక్కడి ఉష్ణోగ్రత మైనస్ 40 డిగ్రీలకు చేరుతుంది. ఆక్సిజన్ స్థాయి కూడా పడిపోతుంది. ఇంతటి క్లిష్టమైన పరిస్థితులలో ఉండే ప్రాంతంలో రోడ్డు నిర్మించడం అదీ కూడా అతి ఎత్తైన ప్రదేశం కావడం గమనార్హం.

Related posts

జెఈఈ అడ్వాన్స్ డ్ 2012 పరీక్ష జులై 3న

Satyam NEWS

పంచాయితీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న జగన్ ప్రభుత్వం

Bhavani

ఆన్ లైన్ ఫ్రాడ్ పై సదస్సు

Sub Editor

Leave a Comment