42.2 C
Hyderabad
April 26, 2024 17: 17 PM
Slider ప్రత్యేకం

ఎక్సక్లూజీవ్: విశాఖ కు తరలివెళ్లేందుకు ముహూర్తం ఇదే

#APCMYSJagan

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి సగం రాజధాని ని విశాఖపట్నం తరలించేందుకు ముహూర్తం ఖరారు అయింది. కరోనా రాకపోయినా, న్యాయ పరమైన సమస్యలు లేకపోయినా ఈపాటికి విశాఖకు రాజధాని తరలింపు పూర్తి అయి ఉండేది.

అయితే అనుకోని విధంగా కరోనా వైరస్ వ్యాపించడంతో ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేతులు కట్టేసినట్లు అయింది. దీనికి తోడు న్యాయ పరమైన అవరోధాలు కూడా రావడంతో కొద్ది రోజులు నిశ్శబ్దంగా ఉండేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు.

 ‘‘ఆపరేషన్ కాపిటల్’’ అమలు

ఇక ఏ అడ్డంకి ఉన్నా విశాఖ పట్నానికి తరలి వెళ్లేందుకు ఆయన ముహూర్తం నిర్ణయించుకున్నారు. రాజధాని పేరుతో కాకుండా ముఖ్యమంత్రి కార్యాలయం తరలింపు పేరుతో ఆయన ‘‘ఆపరేషన్ కాపిటల్’’ అమలు చేయబోతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తరలించుకుంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండే అవకాశం లేదు.

ఎవరు అభ్యంతరం తెలిపినా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇందుకోసం ముహూర్తం కూడా ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి ఈ మేరకు రాజగురువును ముహూర్తం అడిగారని ఆయన అందుకు సంబంధించిన జ్యోతిష్య లెక్కలు వేసి ముహూర్తం ఖరారు చేశారని విశ్వసనీయంగా తెలిసింది.

ముహూర్తం ఖరారు చేసిన రాజగురువు

రాజగురువు పెట్టిన ముహూర్తం ప్రకారం మే 28 ఉదయం 7.30 నిమిషాలకు ముఖ్యమంత్రి విశాఖ పట్నం తరలివెళుతున్నారు. ఆ రోజు ముహూర్తం దివ్యంగా ఉందని రాజగురువు ఆయనకు వెల్లడించారు. ఆ రోజు గురుపుష్య యోగం ఉంది.

గురుపుష్య యోగంలో ఏ కార్యక్రమం చేపట్టినా దిగ్విజయంగా పూర్తి అవుతుందని అంటున్నారు. గురు పుష్య యోగం చాలా అరుదుగా వచ్చే శుభ కాలం. ఇది ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగా కలిసి వస్తుందని రాజగురువు చెప్పారని తెలిసింది.

అమరావతిలో ఉండటం వల్ల అన్నీ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని విశాఖపట్నం తరలి వెళ్లిపోతే అన్ని కష్టాలూ తీరతాయని విశ్వాసం. ప్రస్తుత రాజధాని అమరావతిలో కరోనా వ్యాప్తి చెందింది. ఒక మంత్రి డ్రైవర్ కు కరోనా పాజిటీవ్ వచ్చింది. దాంతో అమరావతిని శాశ్వతంగా మూసివేసేందుకు వీలుకూడా కలుగుతున్నది.

Related posts

అన్నదాతలకు సంకెళ్లు వేయటం టిఆర్ఎస్ ప్రభుత్వ పరాకాష్ట కు నిదర్శనం

Bhavani

తెలుగుదేశం పార్టీ గెలవడంతో వైసీపీ ఏం చేసిందో తెలుసా?

Satyam NEWS

స్పీడ్ లిమిట్ :మితిమీరిన వేగానికి కళ్లెం ఎస్ పి రాహుల్ హెగ్డే

Satyam NEWS

Leave a Comment