38.2 C
Hyderabad
April 27, 2024 17: 57 PM
Slider కడప

ప్రజలు వైసీపీ ని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు

#batyala

జగన్ రెడ్డిని ఓడించేందుకు జనం సిద్ధం గా ఉన్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్యాల చెంగల రాయుడు అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైందని, ఇక మిగిలింది 74 రోజులు మాత్రమే అన్నారు. వైఎస్ ఆర్సీపీ దురాగతాలకు ప్రజాకోర్టులో శిక్షపడే సమయం ఆసన్న మైందన్నారు.

యుద్ధం మొదలైంది, అందుకు టీడీపీ సిద్ధమైందని,ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని జగన్ రెడ్డి,వైఎస్సార్సీపీ నేతలు చెబుతుంటే, మరో వైపు ప్రజలు కూడా వారిని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.జగస్ రెడ్డి అహంకారానికి, వైఎస్సార్సీపీ అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు రైతులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు అంతా సిద్ధమయ్యారన్నారు.ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ జెండా కనుమరుగవనున్నదని తెలిపారు. పీలేరు లో తెలుగు దేశం పిలుస్తోంది రా ఊహించని విధంగా విజవంతంగా అయ్యిందని సంతోషం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ను పూర్తిగా నాశనం చేసిన పార్టీ వైకాపా.. ఇలాంటి పార్టీ ప్రజలకు అవసరం లేదన్నారు. ఈ కురుక్షేత్ర ధర్మ యుద్ధంలో టీడీపీ-జనసేనలు గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయ లేదని, టీడీపీ అధికారంలో ఉంటే సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవని తెలిపారు. కొత్త పన్నులు వేసి, ధరలు పెంచి ప్రజల రక్తాన్ని జలగలా పీల్చేస్తున్నా డని, టీడీపీ హయాంలో లేని ఈ అప్పులు,కష్టాలు ఈ సైకో జగన్ రెడ్డి హయాంలో ఇప్పుడెందుకు వచ్చాయో ప్రజలు ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ బాధితులే టీడీపీకి స్టార్ క్యాంపెయినర్లని తెలిపారు.

ఒకప్పుడు రూ.200 ఉన్న విద్యుత్ బిల్లులు ఇప్పుడు 5 రెట్లు పెరిగి .1000 కి చేరిందన్నారు. మద్యం, నిత్యావసర వస్తువుల ధరలు, ఆర్టీసీ బస్సుల ఛార్జీలను పెంచుతూ ప్రజలను ఈ వైకాపా ప్రభుత్వం దోచుకుంటోందన్నారు. టీడీపీ హయంలో అందరికీ ఉచితంగా దొరికే ఇసుక, ఇప్పుడు సామాన్యులకు అందనంత ధరకు చేరిపోయిందన్నారు. వైకాపా అసమర్థ, విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పాల్గొన్నారు.

Related posts

నాగర్ కర్నూల్ ఎస్సీ మెనెజ్ మేంట్ హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

నిరుపేదలకు భూములు ఇవ్వండి: మూడుమళ్ళరేవు రైతుసంఘం డిమాండ్

Satyam NEWS

శాల్యూట్: కోవిడ్ ధాటికి ఒరిగిపోతున్న వీర సైనికులు

Satyam NEWS

Leave a Comment