30.7 C
Hyderabad
April 29, 2024 04: 45 AM
Slider చిత్తూరు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

#tirupatipolice

తిరుమల శ్రీ వారి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా  ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి తెలిపారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు సంవత్సరాల అనంతరం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న నేపధ్యంలో శ్రీవారి వాహన సేవలు నాలుగు మాడ వీధుల్లో నిర్వహిస్తున్నారన్నారు.

ఈ వేడుకను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు విచేసే అవకాశం ఉన్నందున దానికి తగినట్లుగా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. అదేవిధంగా టీటీడీ అనుబంధ ఆలయాల వద్ద కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు. దొంగతనాలు అరికట్టేందుకు ముందస్తు భాగంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. తిరుమలలోని రద్దీ ప్రాంతాల్లో, ప్రధాన కూడలి వద్ద దొంగల ఫోటోలను ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తామన్నారు.  నిరంతరం అనుమానిత వ్యక్తుల పై నిఘా ఉంచి తమ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తారన్నారు.

సీ.ఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత

ఎన్నో సంవత్సరాలుగా శ్రీవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ అని, అదే విధంగా ఈ నెల 27న సీ.ఎం జగన్మోహన్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఆయన ప్రయాణించే మార్గంలో ఎలాంటి అవకతవకలు చోటు కాకుండా భద్రత చేపట్టామన్నారు. సీ.ఎం పర్యటన కొరకు 1,500 మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేపట్టామన్నారు.

తిరుమల లోని అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పోలీస్ శాఖ పని చేస్తుందన్నారు. ఎవరితో ఎలాంటి మనస్పర్థలు లేకుండా సిబ్బంది పని చేసి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు.

నిరంతరం తనిఖీలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు రెండు ఘాట్ రోడ్లు తిరుమల ప్రాంతాలన్నీ కూడా పోలీసులు జల్లెడ పడతారన్నారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ఘాట్ రోడ్లు తిరుమల ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు చేస్తాయన్నారు. ఈ తనిఖీలు నిరంతరం బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు జరుగుతాయన్నారు. ఆక్టోపస్ సిబ్బంది కూడా తిరుమలలో ప్రత్యేక నిఘా తో పని చేస్తారు. అనుమానిత వ్యక్తుల కదలికలు కనపడిన వెంటనే అదుపులోకి తీసుకొని విచారిస్తామన్నారు.

తొక్కిసలాటలో జరక్కుండా జాగ్రత్తలు

తిరుమల లోని నాలుగు మాడవీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు గ్యాలరీలో చేరుకున్న భక్తులు తొక్కిసలాట లేకుండా తగు జాగ్రత్తలు చేపట్టామన్నారు. ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్లు వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. గరుడ సేవ రోజున టిటిడి నిర్ధేశించిన సమయానికి భక్తులను గ్యాలరీ లోకి అనుమతిస్తామన్నారు. తిరుమల మొత్తం సీసీ కెమెరాలతో మరియు పోలీసుల ఆధీనంలో ఉంటుందన్నారు. తమ సిబ్బంది కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాలను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తారన్నారు. ఎక్కడైనా రద్దీ పెరిగినా కూడా ఆ ప్రాంతాలను అప్పటికప్పుడే గుర్తించి తగు చర్యలు చేపడతామన్నారు.

కట్టుదిట్టంగా పార్కింగ్ ఏర్పాట్లు

తిరుమలలో వాహనాల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టామన్నారు. తిరుమలలో వాహనాల సంఖ్య పెరిగినప్పుడు తిరుపతిలోని అలిపిరి, బాలాజీ లింక్ బస్ స్టాండ్, దేవలోక, భారతీయ విద్యా భవన్, స్విమ్స్ గ్రౌండ్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు.

నగర పరిసరాల్లో చెక్ పోస్ట్ లు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు నగర ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. తిరుపతికి చుట్టు పక్కల నుంచి వాహనాలు వస్తాయో గుర్తించి అన్ని ప్రాంతాలలో చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతాలలో నిరంతరం తమ సిబ్బంది వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారన్నారు. తాత్కాలికంగా చెక్పోస్టుల్లో సిబ్బందిని నియమిస్తామన్నారు.

నాలుగు వేల మందితో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భద్రత

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మొత్తం నాలుగు వేల మంది సిబ్బందితో భద్రత నిర్వహిస్తామని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలలో మొత్తం నాలుగు వేల మంది విధులు నిర్వహిస్తారని గరుడ సేవ రోజున మాత్రం మరో రెండు వేల మంది అదనఅపు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఏ.ఎస్పీ లు 03, డీఎస్పీలు 28, సిఐలు 111, ఎస్సైలు 273, ఏ ఎస్ఐలు/హెచ్ సి లు 979, డబ్ల్యూ పి సి లు 141, పీసీలు 2076, స్పెషల్ పార్టీ లు 121, ఏఆర్/ఏపీఎస్పీ, ఆక్టోపస్, ఇంటెలిజెన్స్ 1100 మంది దాకా భద్రత నిర్వహిస్తారన్నారు

30 తేదీ నుంచి ద్విచక్ర వాహనాలు అనుమతి లేదు

అక్టోబర్ 1న శ్రీవారి గరుడ సేవ పురస్కరించుకొని సెప్టెంబర్ 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరుమలకు ద్విచక్ర వాహనాలను నిషేధించడమైనది. వాహనదారులు అంతా కూడా తిరుపతిలో నిర్దేశించిన అలిపిరి బస్ స్టాండ్ పాత చెక్ పెయింట్ ఇస్కాన్ గ్రౌండ్, మెడికల్ కాలేజి గ్రౌండ్, నెహ్రు మున్సిపల్ గ్రౌండ్ లలో పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు.

గరుడ సేవ రోజు ట్రాఫిక్ మళ్ళింపు

ట్రాఫిక్  మళ్ళి౦పులు ఉండు సమయం :  తేది.30.09.2022 మధ్యహ్నం 12 గంటల నుండి తేది.02.10.2022 ఉదయం వరకు  ట్రాఫిక్ మళ్లింపులు ఈ క్రింద విధముగా ఉండనున్నది.

గరుడసేవ యాత్రికులకు తిరుపతి నందుపార్కింగ్ స్థలములు:

1) “దేవలోక్  పార్కింగ్ :- టూరిస్ట్ బుస్సులు మరియు TTD వారు నిర్ణయీంచిన  పరిమితి కి మించిన వాహనాలు టెంపో ట్రావెలర్ , మెట్టడోర్ మొదలైనవి చెర్లోపల్లి నుండి జూ పార్క్ కి సమీపం లో ఉన్న  “దేవలోక్  పార్కింగ్ వద్ద వాహనాలు పార్కింగ్ చేయవలసిఉన్నది.

2) భారతీయ విద్యా భవన్ స్కూల్ గ్రౌండ్ :- కార్లు, జీపులు మొదలైన చిన్న  వాహనాలు సైన్స్ సెంటర్ కు ఏదురుగా ఉన్న భారతీయ విద్యా భవన్ స్కూల్ గ్రౌండ్ నందు పార్కింగ్ చేయవలసిఉన్నది.

3) ద్విచక్ర వాహనాలు కొరకు:- గరుడ కూడలి వద్ద ఉన్న పాత చెక్ పాయింట్ , ISKON గుడి ఏదురుగా ఉన్న గ్రౌండ్, మెడికల్ కాలేజీ గ్రౌండ్ మరియు మెటర్నటి హాస్పిటల్ కి ఏదురుగా ఉన్న నెహ్రూ మున్సిపల్ స్కూల్ గౌండ్ లో ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయవలసిఉన్నది.

 ఈ కార్యక్రమం నందు అడిషనల్ యస్.పి లు అడ్మిన్ ఇ.సుప్రజ, L &O కులకేఖర్, క్రైమ్ విమలకుమారి, యస్.బి డి.యస్.పి రమణ, ట్రాఫిక్ I డి.యస్.పి కాటమరాజు పాల్గొన్నారు.

Related posts

రామతీర్థం నీలాచలం కొండపైకి చిన జీయర్..!

Satyam NEWS

ఖాకీ ల సమక్షంలో నే మా వాళ్లపై దాడి జరిగింది

Satyam NEWS

బి.సి.నేతల అరెస్ట్ అక్రమం

Satyam NEWS

Leave a Comment