28.7 C
Hyderabad
April 27, 2024 05: 22 AM
Slider సంపాదకీయం

పోలీసులు…. అమరావతి రైతులు… ఓ నోటీసు..

#amaravati

ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరో సారి చర్చలోకి వచ్చారు. అత్యంత పక్షపాతంతో పోలీసులు ప్రవర్తిస్తున్నారని చాలా కాలంగా చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నా ఏపి పోలీసుల తీరు మాత్రం మారడం లేదు. అమరావతి రైతులు మహాపాదయాత్ర నిర్వహించుకోవడానికి అనుమతి అడిగితే ఇవ్వకపోవడం నుంచి తాజాగా వారికి నోటీసులు జారీ చేయడం వరకూ చూస్తే పోలీసుల పక్షపాత వైఖరి ప్రస్ఫుటం అవుతుంది.

అమరావతి రైతుల న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించగా వారు హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. అనుమతి ఇచ్చే సమయంలో హైకోర్టు కొన్ని షరతులు పెట్టిన విషయం తెలిసిందే. మాస్ మూమెంట్ లో షరతులను పాటించడం సాధ్యం కాకపోవచ్చు. శాంతి భద్రతల సమస్య తలెత్తనంత వరకూ హైకోర్టు విధించిన షరతులను పోలీసులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

అయితే ఏపి పోలీసులు ఆ విధంగా చేయడం లేదు. అమరావతి రైతులు ఎప్పుడెప్పుడు గుంటూరు జిల్లా దాటతారా అని కాచుకు కూర్చున్నట్లుగా ప్రకాశం జిల్లా పోలీసులు రైతు పాదయాత్ర నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. పాదయాత్ర నిబంధనలు ఉల్లంఘించారని నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్రలో 157 మందికి మాత్రమే అనుమతి ఇవ్వగా 2500 మంది పాల్గొన్నారని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. రాజకీయ ప్రమేయం ఉండకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చినా రాజకీయ నాయకులు పాల్గొంటున్నారని పోలీసులు అంటున్నారు.

అమరావతి రైతుల పాదయాత్రపై దాడులు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ముఖ్యమంత్రి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే వ్యాఖ్యానించారు. దాడులు జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వమే. అయితే ఎవరో దాడులు చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేసేప్రమాదం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం. ఇలాంటి సందర్భాలలో పోలీసు నిఘా వర్గాలు పసిగట్టి ముందుగానే చెబుతాయి.

వారి నివేదికలను బట్టి పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు. ఇవన్నీ సాధారణంగా జరిగేవే దీనికి పెద్దగా ఎవరో జోక్యం చేసుకుని చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. పాదయాత్రలో రైతులతో బాటు స్థానికులు పాల్గొంటున్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని అంటున్న రాజకీయ పార్టీలు అన్నీ రైతుల పాదయాత్రకు మద్దతు ప్రకటించాయి.

మూడు రాజధానులను ప్రభుత్వం ముందుకు తీసుకవెళుతున్నది. అది ప్రభుత్వ పాలసీ. మూడు రాజధానులు వద్దని అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని మరి కొందరు కోరుకుంటున్నారు. ఈ రెండు భిన్న వాదనల మధ్య చర్చలు జరగాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఊసేఎత్తడం లేదు. పైగా ఈ అంశాలన్నీ కోర్టులో ఉన్నాయి. ఇది ఒక రాజకీయ అంశంగా కూడా మారిన ఈ పరిస్థితుల్లో పోలీసులు ఏం చేయాలి?

ఈ అంశాలను పట్టించుకోకుండా శాంతి భద్రతలను కాపాడే పని మాత్రమే చేయాలి. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే రైతులను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే….? ఇప్పుడు నోటీసలు ఇవ్వడం ద్వారా పోలీసులు అమరావతి రైతులకు వ్యతిరేకంగా కచ్చితమైన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాది. రాష్ట్రాన్ని పాలిస్తున్న వారికి అమరావతి రైతుల పాదయాత్ర అంటే ఇష్టం లేదు కాబట్టి ఎలాగైనా దాన్ని ఆపాలని పోలీసులు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నది.

ఘర్షణ వాతావరణ తగ్గించేందుకు ప్రయత్నించాల్సిన పోలీసులు దాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవడం సహేతుకం కాదు. ప్రభుత్వం ఇప్పటి వరకూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్లు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. అమరావతి రైతులను ఒక పార్టీకి చెందిన వారిగా చూస్తూ ప్రభుత్వం వీరిపై కూడా కక్ష సాధింపు మొదలు పెట్టినట్లుగా అనిపిస్తున్నది.

ఇలాంటి చర్యలు మంచిది కాదు. పోలీసులు రైతుల పాదయాత్రను వేరే కారణాలు చూపి అడ్డుకున్నా కూడా రాజకీయ కక్ష సాధింపుగానే భావించాల్సి వస్తుంది. అందువల్ల పోలీసులు రాజకీయ అంశాల జోలికి వెళ్లడం, అమరావతి రైతులను అడ్డుకోవడానికి ప్రయత్నించడం మానుకుంటే మంచిది.

Related posts

21న ఖమ్మం కు చంద్రబాబు

Murali Krishna

తెల‌గ సంక్షేమం కోసం కృషి చేస్తున్న వైసీపీ పార్టీ: ధర్మాన

Satyam NEWS

అదనపు కలెక్టర్ మను చౌదరికి అదనపు బాధ్యతలు

Satyam NEWS

Leave a Comment