26.7 C
Hyderabad
April 27, 2024 10: 27 AM
Slider ప్రత్యేకం

బీజేపీ కి తొత్తుల్లాగా పని చేస్తున్న టిఆర్ఎస్ నాయకులు

#Dr.MalluRavi

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, పేదల వ్యతిరేక చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్న తరుణంలో తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు బీజేపీ చెప్పినట్లు అఖిల పక్ష నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు.

దేశవ్యాప్తంగా ప్రజల సమస్యల మీద భారత్ బంద్ చేస్తుంటే మద్దతు ఇవ్వాల్సిన అధికార టీఆర్ఎస్ నాయకులు  పోలీస్ లతో  అఖిల పక్ష నాయకులను హౌస్ అరెస్ట్ లు, అరెస్టులు చేయించడం దారుణం అని ఆయనవిమర్శించారు. బంద్ లో పాల్గొన్న వారిని పోలీస్ లు అరెస్ట్ చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండిచారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చెయ్యాలనీ మల్లు రవి డిమాండ్ చేశారు.

బంద్ కు టిఆర్ఎస్ సహకరించాలి

ప్రజల సమస్యలపై ప్రజలు, ప్రతిపక్ష  పార్టీలు నిరసనలు, బంద్ లు చేయడం ప్రజల హక్కు అని ఆయన అన్నారు. ప్రజా హక్కులను హరించడం అప్రజాస్వామికం అన్నారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతాంగ, కార్మిక, వ్యతిరేక విధానాలపై బంద్ చేస్తుంటే మద్దతు ఇవ్వాల్సిన టిఆర్ఎస్ ప్రభుత్వం  అరెస్ట్ లు చేయించడం దారుణమన్నారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాలి తప్ప ఇలా అక్రమ అరెస్టులు చేయించడం తెలంగాణ కేసీఅర్ ప్రభుత్వం మానుకోవాలన్నారు.

కేరళ, ఆంద్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో అధికార పార్టీలు బంద్ కు సహకరిస్తున్నాయి. కేసీఅర్ ప్రభుత్వానికి ఏమైంది అన్నారు. ప్రజల సమస్యలు సీఎం కేసీఅర్ కు పట్టదా? ప్రశ్నించారు.

అరెస్టులు చేయించడం పై  టిఆర్ఎస్, బీజేపీ లోపాయకారి ఓప్పందాలతో కలిసి పనిచేస్తున్నాయన్నారు. బిజేపి, టిఆర్ఎస్ పార్టీలు తోత్తులు అని ఆయన వ్యాఖ్యానించారు.

Related posts

రామంతాపూర్ డివిజన్ సమస్యలపై విస్తృత పర్యటన

Satyam NEWS

నరసరావుపేట ఆర్టీసీ డిపోలో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు

Satyam NEWS

మహిళా కాంగ్రెస్ కు కొత్త శక్తి: ఏ బ్లాక్ అధ్యక్షురాలిగా అమరేశ్వరి

Bhavani

Leave a Comment