37.2 C
Hyderabad
May 2, 2024 14: 22 PM
Slider నల్గొండ

ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకోవాలి

#CPM Nalgonda

కరోనా నేపథ్యంలో ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడాలని సి.పి.ఐ.యం. కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక మేకల లింగయ్య స్మారక భవనం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

పెరుగుతున్న కరోనా వైరస్ నివారణ కోసం వైద్యులను, నర్సులను, తదితర అవసరమగు సిబ్బంది పోస్ట్ లను వెంటనే భర్తీ చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్న వైద్య, ఆరోగ్య, మున్సిపాలిటీ, పోలీస్, కరెంటు, జర్నలిస్టు,ఉద్యోగ,కార్మిక రంగాలవారికి ప్రభుత్వాలు ఒక భరోసా, భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు.

మంత్రులు, యం. ఎల్. ఏ.లు వంటి ప్రజా ప్రతినిధులకు కరోనా వైరస్ పాజిటివ్ వస్తే కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని, సామాన్య ప్రజల కు కరోనా వస్తే ప్రభుత్వ హాస్పిటల్ లో తగిన సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఎన్నికల సమయంలో ఓటుకు,పది వేలు,మందు పంచి గెలిసిన రాజకీయ పార్టీల నాయకులు విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఏమేమి ఇస్తారో,ఎందుకు ఇవ్వరో చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మానసిక, ధైర్యం కల్పించే కళా రూపాలు, పత్రికా, మీడియా యాడ్స్ ను ఎక్కువగా ఇవ్వాలని కోరారు.

ఈ నెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు సి.పి.యం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సమస్యలపై సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు జిట్ట నగేష్ ,అవిశెట్టి శంకరయ్య, మండల నాయకులు పామనుగుల్ల అచ్చాలు, నారబోయిన శ్రీనివాసులు, శీలా రాజయ్య, జిట్ట సరోజ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇకనైనా పాజిటీవ్ గా ఆలోచించాలి జగన్

Satyam NEWS

ప్రజానాట్య మండలి మూడవ మహాసభలను జయప్రదం చేయండి

Satyam NEWS

తెలంగాణ లో రేపటి నుంచి స్కూళ్లు బంద్

Satyam NEWS

Leave a Comment