27.7 C
Hyderabad
April 26, 2024 06: 20 AM
Slider జాతీయం

గుజరాత్ లో మజ్లీస్ అధినేత ఒవైసీకి నిరసనలు

#owisi

గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సూరత్‌కు చేరుకున్న ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి భారీ నిరసనలు ఎదురవుతున్నాయి. రుదార్‌పురా బే ర్యాలీకి హాజరైన ఆయనకు నల్లజెండాలు చూపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సూరత్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న ఏఐఎంఐఎం అభ్యర్థికి ప్రచారం చేసేందుకు ఒవైసీ నగరానికి వచ్చారు.

ఆదివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే వారిష్‌ పఠాన్‌తో కలిసి ఆయన ప్రసంగించాల్సి ఉంది. బహిరంగ సభకు హాజరయ్యేందుకు ఒవైసీ రుదార్‌పురా బే వద్దకు చేరుకోగానే ముస్లింలతో సహా కొంతమంది యువకులు మోదీ-మోదీ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. ఒవైసీ పర్యటనకు వ్యతిరేకంగా వారు నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. గత వారం, పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రయాణిస్తున్న వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగిందని AIMIM అధికార ప్రతినిధి ఆరోపించారు.

అయితే, అలాంటి సంఘటనేమీ జరగలేదని పోలీసులు ఖండించారు. గుజరాత్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 1న తొలి దశ ఓటింగ్‌ జరగనుంది. ఆ రోజు 89 స్థానాలకు పోలింగ్ జరగనుండగాడిసెంబర్ 5న రెండో విడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Related posts

400 ఎకరాలు కబ్జా చేసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

Satyam NEWS

కాపు కులస్తులకు క్షమాపణ చెప్పిన అంబటి రాంబాబు

Satyam NEWS

వోట్ టు టీఆరెస్:దేశంలోనే ఆదర్శవంతంగా వేములవాడ

Satyam NEWS

Leave a Comment