28.7 C
Hyderabad
April 26, 2024 10: 11 AM
Slider మహబూబ్ నగర్

8,9 తరగతుల విద్యార్ధులకు ఆన్లైన్ లో రోల్ ప్లే పోటీలు

#roleplaycompetetion

విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీయడానికి నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ ,మోడల్, కేజీబీవీ ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి, 9వ తరగతి చదువుతున్న  విద్యార్థులకు జిల్లా స్థాయిలో ఆన్లైన్ లో రోల్ ప్లే పోటీలు నిర్వహిస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అంశాలు::

1. ఆరోగ్యంగా ఉండడం లో పౌష్టికాహార పాత్ర

2. భౌతిక,మానసిక,లైంగికపరమైన అంశాలలో స్వీయ భద్రత

3. అంతర్జాలాన్ని సక్రమంగా వినియోగించడం

4. మత్తుపదార్థాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 నిబంధనలు ::

1. 8వ మరియు 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు

2. పోటీలలో నలుగురు లేక ఐదుగురు బాలబాలికలు పాల్గొనవచ్చు 

3.పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు పాఠశాల యూనిఫామ్ లోనే ఉండాలి

4. సమయం 5 నుండి 6 నిమిషాలు

పైన తెలిపిన అంశాలలో ఏదైనా ఒక అంశాన్ని ఎన్నుకొని దాన్ని 5 లేదా 6 నిమిషాలు  వీడియోను చిత్రీకరించి తేదీ 27.10.2021 సాయంత్రం 5 గంటల లోగా  dsonagarkurnool@gmail.com మెయిల్ ఐడి కి పంపించాలని డీఈఓ సూచించారు. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి నగదు పారితోషికం కూడా లభిస్తుందన్నారు.

జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. మరిన్ని వివరములకు జిల్లా సైన్స్ అధికారి కృష్ణా రెడ్డి(9989921105) ని సంప్రదించాలని కోరారు.

Related posts

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి కారు చిచ్చు

Satyam NEWS

సగర్వంగా చాటుదాం..

Satyam NEWS

సత్యం న్యూస్ వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు

Satyam NEWS

Leave a Comment