32.7 C
Hyderabad
April 27, 2024 01: 35 AM
Slider వరంగల్

మహిళల కోసం 24 గంటలు అందుబాటులో సఖి కేంద్రం

#SakhiCenter

సఖి కేంద్రం మహిళల కోసం 24 గంటలు అందుబాటులో ఉంటుందని SHG  VO లీడర్ కొట్టెం మల్లికాంబ తెలిపారు.

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కేంద్రంలో తాడ్వాయి  కమారం, తాడ్వాయి  గ్రామపంచాయతి పరిధిలో ఉన్న సఖి సెంటర్ లో నేడు జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

కుట్టుకేంద్రంలో మహిళలకు సఖి సెంటర్ అందించే 5 రకాల సేవలను వివరించారు. సఖి సెంటర్  సైకో సోషల్ కౌన్సిలర్స్  కల్పన, స్రవంతి, కేస్ వర్కర్  సాధన, పారా మెడికల్ వర్కర్స్, V రాధ, Y. అరుణ, IT అసిస్టెంట్ K. కిరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గ్రామంలోని మహిళలకు వైద్య సహాయం, కౌన్సిలింగ్, న్యాయ సహాయం, పోలీస్ సహాయం, ఐదు రోజుల తాత్కాలిక వసతి కల్పించేందుకు వెసులుబాటు ఉందని వారు చెప్పారు.

బాల్య వివాహాలు,  వరకట్న వేధింపులు,  గృహ హింస,  లైంగిక వేధింపులు, శారీరక వేధింపులు, పనిచేసే చోట వేధింపులు, బాలల అక్రమ రవాణా, ఎలాంటి ఆధారం లేని వయోవృద్ధులు, మహిళలు, బాలికలు ఉంటే సఖి  కేంద్రానికి సమాచారం ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమం లో  కోట శ్రీమతి, బంగారు మానస, ఈర్ప సుమలత,  వార్డ్ మెంబెర్  కృష్ణకుమారి, ఈర్ప జీవనజ్యోతి, కాయం రాధిక, గట్టు సుశీల, ఈర్ప కవిత, అలెం సుజాత పాల్గొన్నారు.

Related posts

కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు

Satyam NEWS

కన్ఫ్యూజన్: ఆర్డినెన్సు ద్వారా ఏపి బడ్జెట్ ప్రతిపాదన?

Satyam NEWS

ఫాసిజంకు వ్యతిరేకంగా లౌకిక వాద పరిరక్షణకై విశాల ఉద్యమం

Satyam NEWS

Leave a Comment