35.2 C
Hyderabad
April 27, 2024 11: 57 AM
Slider మహబూబ్ నగర్

పదవీ బాధ్యతలు స్వీకరించగానే కలెక్టర్ ఏం చేశారో తెలుసా?

#Blood Donation

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా నూతనంగా నియమితులైన ఎల్ శర్మన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు స్వీకరించగానే ఆయన చేసిన పని ఏమిటో తెలుసా? నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిని ఆయన సందర్శించారు. అక్కడ రోగులను పరామర్శించారు.

అక్కడ ఉన్న సౌకర్యాలను, మెరుగుపరచాల్సిన అంశాలను వివరించారు. కలెక్టర్ ఆసుపత్రిలో ఉండగానే ఒక గర్భిణి స్త్రీకి నొప్పులు వచ్చాయి. ఆమెను ఆసుపత్రిలోని ఆపరేషన్ ధియేటర్ కు తీసుకువెళ్లారు. అక్కడ ఆమెకు రక్తం అవసరం పడింది. ఓ నెగెటీవ్ రక్తం అవసరం అయింది. జిల్లా కలెక్టర్ మరేం ఆలోచించలేదు.

నేను రక్తదానం చేస్తాను అని ముందుకు వచ్చారు. తక్షణమే ఆయన రక్తదానం చేశారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఒక మహత్కార్యాన్ని చేసిన జిల్లా కలెక్టర్ కు సత్యం న్యూస్ సెల్యూట్ చేస్తోంది.

Related posts

జగనన్న గోరుముద్ద రుచి చూసిన మేడా

Satyam NEWS

సీల్డ్ కవర్: వేములవాడ చైర్మన్ గా మాధవి వైస్ గా రాజేంద్ర

Satyam NEWS

తీన్మార్ మల్లన్నకు పోలీసు వేధింపులపై డీజీపీకి నోటీసు

Satyam NEWS

Leave a Comment