32.7 C
Hyderabad
April 27, 2024 00: 40 AM
Slider కవి ప్రపంచం

ఆకలి దేవోభవ

#Ramadevi Kulkarni

ఏ అథ్లెట్లు పనికిరారు

ఏ యుద్ధవీరులు

వీరి ముందు ఆనలేరు

ఆ యుద్ధం ఆకలిపై

తమ పొట్ట తిప్పలుకై

కూడు గూడు లేక

ముసలి ముతక పిల్లాజెల్ల

అందరినీ ఏస్కోని

మైళ్లకు మైళ్ళు దారి పడితే

నీ పాదముద్రలు ఏసిన

ఎర్రటి రక్త చందనములు

భూతల్లికి పెట్టిన బొట్లు

గుండెపగిలి ఆమె కార్చిన కన్నీళ్లు

చావుకన్నా భయంకరమైన

నీ ఆకలి కేకలు

నభోమండలాన్ని చీల్చుకొని

పైపైకి మంటలా ఎగిసిపడి

క్షుధాగ్ని ముందు చల్లారిపోయెనా ఏమీ

పొట్ట చేతబట్టుకుని బతుకొచ్చిన

ఓ వలస జీవీ… !!

నీ నోటికి బుక్కెడు బువ్వ కాలేకపోయంది

నీవు నమ్ముకొని వచ్చిన ఈ పట్నం

ఏ దేవుడైన కానరాకపోతాడా

నీ కడుపు గోస వినకపోతాడా

నీ పరుగును పొదుముకోక పోతాడా

పిచ్చిగానీ…

ఆకలిదేవోభవ అన్న ఆ  అరుపు

అన్నదాతలారా ఆలకించండి

పట్నం గొడ్డుబోలేదని చెప్పండి..!!

రమాదేవి కులకర్ణి, హైదరాబాద్, 8985613123

Related posts

ప్రశ్నించుకో

Satyam NEWS

అప్పుల జగన్నాథం బండిని నడిపించగలడా?

Satyam NEWS

విదేశీ విశ్వవిద్యాలయాల విద్యార్ధుల సంఘీభావం

Satyam NEWS

1 comment

Yuddandi Siva Subramanyam June 10, 2020 at 3:15 AM

చాలా బాగుంది

Reply

Leave a Comment