28.7 C
Hyderabad
April 26, 2024 09: 50 AM
Slider కవి ప్రపంచం

తొలకరి బంధం

#C S Rambabu

భగభగలాడుతున్న భానుడు

ఎందుకో శాంతి మంత్రం పఠించాడు

నల్లని మేఘాల కురులను

ఆకాశం సవరించింది

మేలిముత్యాల్లాంటి చినుకులను

కానుకచేసి నేలపై జారవిడిచింది

చిటపటలాడే ఎండ

చిటపట చినుకుల దృశ్యంగా మారిన క్షణాలు

బోనమెత్తిన ఆషాఢంలా ఉన్నాయి

తొలకరి చినుకంటే చిలిపి జ్ఞాపకాలేకాదు

నేల దాహం తీర్చే ఆకాశాన్ని

సిద్ధంచేసిన బుతుచక్రముంటుంది

ఆకలితీర్చే రైతు నాగలి తొలిఅడుగుకు తోరణం కట్టిన కృతజ్ఞతా ఉంటుంది

తన ఒడిలో తలదాచుకున్న చిన్నారికి వెచ్చని స్పర్శను పొదిగిన అమ్మలా

భూమాత ఒడిని చేరిన చినుకు

ఆకుపచ్చని స్వప్నాన్ని నేలకు దింపి

స్నేహగీతాన్ని శ్రుతి చేస్తుంది

జీవనయానంలో వర్షపర్వాన్ని

కళ్ళకద్దుకుంటాడు రైతుసోదరుడు

దిగుబడితో ఋణం తీర్చుకుంటాను

అనుభూతిగీతాన్ని దాచుకుంటాడు కవిమిత్రుడు

సి.యస్.రాంబాబు

Related posts

బొందిలి కులస్తులను ఓబీసీలలో చేర్చడానికి కృషి చేస్తాం

Satyam NEWS

పెన్షన్ ఇచ్చేందుకు ‘వితంతువు’ అనే పేరు మార్చాలి

Satyam NEWS

కోవిడ్ 19 రిలీఫ్ కోసం తోషిబా సిస్టమ్స్ విరాళం

Satyam NEWS

Leave a Comment