29.7 C
Hyderabad
May 3, 2024 03: 40 AM
Slider విజయనగరం

విజ‌య‌నగ‌రం జిల్లా పోలీసుకు ఎల‌క్షన్ క‌మీష‌న‌ర్ కితాబు

#NimmagaddaRameshkumar

రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ముగిసింది. అదే రోజు అర్ద‌రాత్రి  12 వ‌ర‌కు ఓటింగ్ జ‌ర‌గ‌డం విశేషం.

ద‌గ్గ‌రుండీ డీజీపీ అదేశాల మేర‌కు అన్ని జిల్లాల ఎస్పీలు  స్వ‌యంగా కౌంటింగ్ ను కూడా ప‌రిశీలించి…ఎలాంటి అవాంఛ నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా స‌జావుగా పూర్తి చేయించారు. అయితే రెండు జిల్లాలో జ‌రిగిన ఘ‌ట‌న‌లు…కాస్త ఇబ్బందిని క‌లిగించాయి.

ఒక‌టి తూర్పుగోదావ‌రి జిల్లా,ఇంకొక‌టి విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జ‌రిగిన ఘ‌ట‌న‌లు కాస్త  ఇబ్బంద‌నే చెప్పాలి. తూర్పుగోదావ‌రి జిల్లా ఓ అధికారి అస్వ‌స్థ‌త‌కు గురై మృతి చెందితే,విజ‌య‌న‌గ‌రం జిల్లా పూస‌పాటిరేగ మండ‌లం చౌడ‌వాడ లో పొలింగ్ కేంద్రంలో జ‌రిగిన ఘ‌ట‌న హింస్మాత్మ‌కంగా మార‌కుండా ఒకే ఒక కానిస్టేబుల్ కిషోర్ కుమార్ బాబు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించాడు.

విజ‌య‌న‌గ‌రం జిల్లా చౌడ‌వాడలో ముందుగానే గొడ‌వ జ‌రుగుతుంద‌ని అక్క‌డున్న లోకల్ మీడియా ద్వారా తెలుసుకున్న పోలీసులు…చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్స్ లు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా…అక్క‌డే విధులను నిర్వ‌ర్తిస్తున్న కానిస్టేబుల్ చాలా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

అక్క‌డికి స‌మీపం పోలింగ్ కేంద్రాల‌లో డీఐజీ,ఎస్పీలు ప‌ర్య‌టించారు.అదీ గాక స‌మ‌స్యాత్మ‌క గ్రామాలైన కెల్ల‌,ఒమ్మి,చింత‌ప‌ల్లి పోలింగ్ కేంద్రాల‌ను స్వ‌యంగా డీఐజీ రంగారావు,డీఎస్పీ అనిల్ సంద‌ర్శించారు.

జిల్లాలో జ‌రిగిన విష‌యం రాష్ట్ర ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ కు తెలియ ప‌రిచిన వెంట‌నే..ఎల‌క్ష‌న్ కమీష‌నర్…స్వ‌యంగా  జ‌రిగిన ఎన్నిక‌లు ప్రశాంతంగా ముగియ‌డానికి పోలీసులు సేవ‌ల‌ను అయోఘ‌మ‌ని కొనియాడుతూ…ఓ వీడియో విడుద‌ల చేయ‌డం విశేషం.ఏదైనా విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీసుల‌కు మ‌రోసారి హేట్సాఫ్.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్, విజయనగరం

Related posts

మిర్చి@32

Sub Editor 2

మాజీ ఎమ్మెల్యే ఆమంచికి పాము కాటు

Bhavani

ఘనంగా ఉత్తమ్ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment