39.2 C
Hyderabad
April 28, 2024 13: 52 PM
Slider జాతీయం

హియరింగ్:శబరిమలలో మహిళల ప్రవేశంపై విస్తృత ధర్మాసనం

supreme court

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై ఈ నెల 13 నుంచి సుప్రీంకోర్టు వాదనలు వినబోతున్నది. శబరిమలతో బాటు ఇతర మతాలలో ఉన్న ఇలాంటి ఆచారాలపై దాఖలైన కేసులను కూడా సుప్రీంకోర్టు విచారిస్తుంది.

9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం వాదనలు విననున్నట్టు సుప్రీం కోర్టు నిన్న తెలిపింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంతోపాటు దర్గాలు, మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, ఇతర మతస్థుల్ని పెళ్లాడే పార్సీ మహిళలకు మతపరమైన ప్రాంగణాల్లో ప్రవేశం లేకపోవడం తదితర అంశాలపైనా సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ 2018లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పును వ్యతిరేకిస్తూ 65 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా, ఈ తీర్పును పునఃపరిశీలించాలంటూ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ పిల్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 13 నుంచి వాదనలు విననున్నట్టు తెలిపింది.

Related posts

అలవికాని నిబంధనలతో రిజిస్ట్రేషన్లు కష్టతరం

Satyam NEWS

కామవరపుకోట రోడ్డుకు తూట్లు పడ్డాయి

Bhavani

హరీష్, హుజూరాబాద్ సరే పరిగిని అభివృద్ధి చేశారా?

Satyam NEWS

Leave a Comment