27.2 C
Hyderabad
December 8, 2023 18: 05 PM
Slider ఆంధ్రప్రదేశ్

బీజేపీ లో చేరిన మరో తెలుగుదేశం గూటి పక్షి

adinarayanareddy

ఇంతకాలం తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బిజెపిలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆది నారాయణరెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. ఆదినారాయణరెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం టీడీపీలో చేరి మంత్రి పదవిని దక్కించుకున్నారు. టీడీపీలో కీలక నేతగా వ్యవహరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపులో కీలకంగా వ్యవహరించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆయన బీజేపీలో చేరుతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరిగింది. ఇటీవలి కాలంలో బీజేపీలో చేరేందుకు ఓసారి ఢిల్లీ వెళ్లారు. కొన్ని కారణాల వల్ల అప్పట్లో జాయిన్‌ కాలేదు.. అయితే సోమవారం నాడు ఢిల్లీ వేదికగా జేపీ నడ్డా సమక్షంలో ఆది కాషాయ కండువా కప్పేసుకున్నారు. కాగా కడప జిల్లాలో టీడీపీ కీలకనేతగా ఉన్న ఆది బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీకి షాక్ తగిలినట్లైంది.

Related posts

మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు

Satyam NEWS

నవంబర్ ఒకటి నుంచి ఏడు వరకు అమరవీరుల వర్ధంతి సభలు

Murali Krishna

కాంగ్రెస్‌లో వివాదాలకు విరామం

Murali Krishna

Leave a Comment

error: Content is protected !!