37.2 C
Hyderabad
April 26, 2024 20: 18 PM
Slider సంపాదకీయం

స్ట్రాటజీ: ప్లాన్ మూడో దశలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు

chandraba

ప్రతిపక్ష నాయకుడిని, ప్రతిపక్ష నాయకుడిని అని పదే పదే చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడికి అది లేకుండా చేసేందుకు పావులు కదుపుతున్నారు. బహుశ త్వరలోనే అది జరిగే అవకాశం ఉంటుంది. చంద్రబాబునాయుడికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా పోతే ఇప్పుడు ఆయనకు ఉన్న కొన్ని సౌకర్యాలు తీసేస్తారు.

40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఇది తీరని అవమానంగా మిగలబోతున్నది. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికలలో కేవలం 23 స్థానాలలో గెలిచింది. గెలిచిన నాటి నుంచి ఈ తొమ్మిది నెలల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు గీత దాటి వెళ్లిపోయారు. వల్లభనేని వంశి, మద్దాలి గిరి, కరణం బలరాం లు పార్టీ వదలి వెళ్లిపోయారు.

శాసనసభ్యత్వాలు మాత్రం వారు అంటిపెట్టుకునే ఉన్నారు. వాస్తవంగా తమ పార్టీలో చేరాలంటే ఎదుటి పక్షం వారు పదవులకు రాజీనామా చేసి రావాలని అలాగైతేనే పార్టీలో చేర్చుకుంటామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.

గత అసెంబ్లీలో తమ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబునాయుడు తన పార్టీలో కలుపుకున్నాడని, అందువల్ల ఈ అసెంబ్లీలో దేవుడు కేవలం 23 మంది మాత్రమే గెలిచేలా చేశాడని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఆ తర్వాత తన రూల్ ను సడలించుకున్నారు. దేవుడి స్క్రిప్టుకు కొద్దిపాటి మార్పులు చేసి ముగ్గురిని  అనధికారికంగా తన పార్టీలో చేర్చేసుకున్నారు.

 అయితే ఇప్పుడు తాజాగా దేవుడి స్క్రిప్టును పూర్తిగా మార్చేసేందుకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిశ్చయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి తమ పార్టీలో చేరేందుకు వేచి ఉన్న కనీసం 10 మంది ఎమ్మెల్యేలకు కండువా కప్పేస్తే సరిపోతుందని ఆయన భావిస్తున్నారు.

ఇందులో భాగంగానే ముందుగా కరణం బలరాం ను చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి సుమారుగా 10 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అడు చెప్పడం భావ్యం కాదని జగన్ తాజాగా నిర్ణయించారు. తెలంగాణ లో ఏ విధంగా అయితే రెండింట మూడు వంతుల మంది ఎమ్మెల్యేలు గోడ దాటిన తర్వాత వారిని వైసిపిలో చేర్చేసుకోవాలనే పథకాన్ని అమలు చేస్తున్నారు.

అవసరమైనంత మంది ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత తెలుగుదేశం శాసనసభా పక్షాన్ని వైసిపిలో విలీనం చేస్తారు. ఇప్పటికే కౌన్సిల్ రద్దు చేసి తెలుగుదేశం పార్టీని చావు దెబ్బ కొట్టిన జగన్ ఇప్పుడు అన్ని జిల్లాలలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులను చేర్చుకునే పనిలో ఉన్నారు. జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు వచ్చేసిన తర్వాత ఇక తెలుగుదేశం పని ఖతం అయినట్లే అనే పరిస్థితి రాగానే ఎమ్మెల్యేలకు గేట్లు ఎత్తుతారు. ఆ చివరి స్ర్టోక్ తో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా పోతుంది. చంద్రబాబు రాష్ట్రంలో జీరో గా మిగులుతారు.

Related posts

ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ, మానవహారం

Satyam NEWS

అల్లరి చేస్తున్నది చంద్రబాబు బినామీలే

Satyam NEWS

బీసీ కుటుంబాలకు లక్ష ఆర్థిక సహాయం

Satyam NEWS

Leave a Comment