26.2 C
Hyderabad
July 23, 2024 19: 37 PM
Slider చిత్తూరు

తిరుమల కొండపై రాజ్యమేలుతున్న దళారులు

a v ramana

కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని భక్తులకు దూరం చేసే కుట్ర జరుగుతున్నదని టీటీడీ మాజీ సభ్యుడు ఏ వి రమణ ఆరోపించారు. భగవంతునికి,  భక్తులకు అనుసంధానంగా ఉంటామన్న వైకాపా ప్రభుత్వం ఇప్పుడు శ్రీనివాసుడుకి భక్తులకు మధ్య గోడ కడుతోందని ఆయన ట్విట్లర్ లో పేర్కొన్నారు. వీఐపీ దర్శనాల పేరుతో బ్రోకర్లు అక్కడికి వచ్చిన భక్తులను దోచుకుంటున్నారని ఆయన అన్నారు. వందల సంఖ్యలో దళారులు కొండపై రాజ్యమేలుతున్నారని సామాన్య భక్తులను కొండకు రాకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు టీటీడీ చేస్తోందని రమణ వ్యాఖ్యానించారు. ఇప్పటికే టిటిడి అతిధి గృహాల ధరలు రెండింతలు చేసారు. ఇప్పుడు భారీగా లడ్డు రేట్లను పెంచేస్తున్నారు. టీటీడీ  తీసుకుంటున్న నిర్ణయాలు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Related posts

పక్కలో బల్లెం: రఘురామకు తోడు మరో ఇద్దరు

Satyam NEWS

తాగిన మత్తులో మాట్లాడుతున్న మంత్రి నాని

Satyam NEWS

అట్టర్ ప్లాఫ్ ఎమ్మెల్యే

Murali Krishna

Leave a Comment