26.7 C
Hyderabad
April 27, 2024 09: 26 AM
Slider ముఖ్యంశాలు

బురద చల్లడమే తప్ప ఇప్పటి వరకూ నిందితులు దొరకలేదు

#Vijayanagaram Collector

రామ‌తీర్దం నీలాచలం కొండ‌పై రాములోరి విగ్ర‌హ ధ్వంసం ఎవ‌రు చేసారో ఇప్ప‌టికీ రాష్ట్ర ప్ర‌భుత్వం చెప్ప‌లేని ప‌రిస్థితిలో ఉంది. ఆఘ‌మేఘాల మీద ఎంపీ నుంచీ మంత్రులు వర‌కూ అంద‌రూ ప‌ర్య‌టించి…ప్ర‌తి ప‌క్ష పార్టీపై బురద జ‌ల్లారే  త‌ప్ప‌..ఇంత‌వ‌ర‌కు నిందితుల‌ను పోలీసులు ప‌ట్టుకోలేక‌పోయారు.

కొత్త సీఎస్ గా బాధ్య‌త‌లు తీసుకున్న ఆదిత్య దాస్..రాష్ట్ర స్థాయిలో మ‌త సామ‌ర‌స్య‌క‌మిటీ వేసి…జిల్లా స్థాయిలో క‌మిటీలు వేయాల‌ని క‌లెక్ట‌ర్,ఎస్పీల‌కు ఆదేశాలు జారీ చేసారు. ఈ నేప‌ద్యంలో విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ చైర్మ‌న్ గా,ఎస్పీ వైస్ చైర్మ‌న్ గా ఉంటూ ఆరుగురు మ‌త పెద్ద‌ల‌తో క‌మిటీని ఏర్పాటు చేశారు.

ఈ మేర‌కు సద‌రు ముస్లిం, క్రిస్టియ‌న్, జైన్, సిక్, హిందున‌కు చెందిన స‌భ్యుల‌తో క‌లెక్ట‌ర్ డా.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్, ఎస్పీ రాజ‌కుమారీలు సంయుక్తంగా మీడియా  స‌మావేశం నిర్వ‌హించారు. మీడియా స‌మ‌క్షంలో మ‌త‌సామ‌ర‌స్య క‌మిటీ వేస్తున్న‌ట్టు తెలిపి అక్క‌డిక్క‌డే సంబంధింత వ్య‌క్తుల‌ను స‌భ్యులుగా నియమిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసారు..జిల్లా క‌లెక్ట‌ర్, డా.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్.

అనంత‌రం…క‌లెక్ట‌ర్,ఎస్పీలు మీడియాతో మాట్లాడుతూ…. పీస్ క‌మిటీ నియ‌మ నిబంధ‌న‌ల‌ను తెలియ చేసారు.  రామ‌తీర్ధం నీలాచలం కొండ పై విగ్ర‌హ ధ్వంసం కేసు  గురించి ఎస్పీ మాట్లాడుతూ…నిందుతుల‌ను ప‌ట్టుకునే వేటలోనే ఉన్నామ‌న్నారు.

నిందితులెవ్వ‌రైనా వ‌దిలి పెట్టేది  లేద‌ని…సైంటిఫిక్ కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని….ఎస్పీ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్, కమిటీ సభ్యులు శ్రీ పీసపాటి సంపత్ కుమార్ ఆచార్యులు, ఎస్.కే. ఆన్సర్ జానే మౌజన్, లూర్ధు మర్నేని, ప్రవీణ్ కుమార్ అంచాలియా తరపున సునీల్ కుమార్ జైన్, బాబాజీ జస్వీర్ సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్ర రైతాంగానికి సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి

Satyam NEWS

గంగా విలాస్ క్రూయిజ్ ను ప్రారంభించిన ప్రధాని

Bhavani

టీడీపీ నేతల అద్వర్యంలో కరోనా నివారణకు ఆనందయ్య మందు పంపిణీ

Satyam NEWS

Leave a Comment