30.2 C
Hyderabad
February 9, 2025 20: 53 PM
Slider వరంగల్

వేయి స్తంభాల గుడి నుంచి భారీ తిరంగా ర్యాలీ

wgl abvp 1

పౌరసత్వ చట్టం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ABVP వరంగల్ నగర శాఖ ఆధ్వర్యంలో నేడు భారీ ర్యాలీ జరిగింది. మతం ఆధారంగా హింసకు గురి అవుతున్న హిందువులను, సిక్కులను, పార్సీలను, జైనులను కాపాడటం మన కర్తవ్యమని వారన్నారు.

CAA కి మద్దతుగా వెయ్యి స్తంభాల గుడి నుండి పబ్లిక్ గార్డెన్ వరకు భారీ తిరంగా ర్యాలీ జరగగా వేలాది మంది యువకులు పాల్గొని దేశభక్తి నినాదాలు చేశారు. అనంతరం పబ్లిక్ గార్డెన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో ABVP జాతీయ కార్యవర్గ సభ్యుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి, ABVP రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్ మాట్లాడారు.

CAA చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని, కేవలం అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లోని మైనారిటీ వర్గాలుగా ఉన్న వారి కోసం మాత్రమేనని వారన్నారు. పౌరసత్వ చట్టం వల్ల ఈ దేశ పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేదని వారు స్పష్టం చేశారు. TRS, కాంగ్రెస్, కమ్యూనిస్టులు దీన్ని రాజకీయం చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చిగొడుతున్నారని అన్నారు.

ఈ మహా ప్రదర్శనలో బీజేపీ నాయకులు మాజీ శాసనసభ్యులు మందాడి సత్యనారాయణ, రురల్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఈగ మల్లేశం,గండ్రతి యాదగిరి, రావుల కిషన్, చింతకుల సునీల్, డాక్టర్, విజయలక్ష్మి, రిటైర్డ్ టీచర్స్ సెల్ రాష్ట్ర నాయకులు విజయలక్ష్మి, ప్రభాకర్, సమ్మయ్య, జిల్లా నాయకులు గురుమూర్తి శివకుమార్, కొలను సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.

వీరేకాకుండా సంగని జగదీశ్వర్, తాళ్లపల్లి కుమారస్వామి, మండల సురేష్, పాశికంటి రాజేంద్ర ప్రసాద్, సిద్ధం నరేష్, వి.హెచ్.పి నాయకులు జైపాల్ రెడ్డి, కట్ట రమేష్, కేర్ ఫార్మసీ కాలేజీ సుధీర్ ఆర్య, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ కాళీప్రసాద్, డాక్టర్ శ్రీనివాస్ వర్మ తరలివచ్చారు.

వీరితో బాటు రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు సంజీవ రావు, న్యాయవాదులు కవిత, సంసాని సునీల్, రామకృష్ణ, మాతంగి రమేష్ బాబు, ఛార్టర్డ్ అకౌంటెంట్స్ : రవి, పి.వి.నారాయణ రావు, మార్వాడి సమాజ్ వేణుగోపాల్, సత్యనారాయణ కాలాని, ఏబీవీపీ వేణు, సాయి చందు, క్రాంతి, రాహుల్, ఇతర బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, బార్ అసోసియేషన్ న్యాయవాదులు, డాక్టర్స్, ఉపాధ్యాయులు, ప్రోఫెసర్లు పాల్గొన్నారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కొత్త కమిషనర్

Satyam NEWS

16 నుంచి 22 వరకు చిరంజీవి, పవన్ ల జన్మదిన వారోత్సవాలు

Satyam NEWS

నేడే తెలంగాణ లో ఆర్ ఎస్ ఎస్ సంకల్ప్ శిబిరం

Satyam NEWS

Leave a Comment