28.7 C
Hyderabad
April 26, 2024 10: 13 AM
Slider గుంటూరు

అండర్ 16 బాయ్స్ అండ్ గర్ల్స్ బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ ప్రారంభం

#under19basketball

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ లో అండర్ 16 బాయ్స్ అండ్ గర్ల్స్ బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ ను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు ముఖ్య అతిథిలుగా హజరయ్యారు. జెండా వందనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.

ఈ సందర్భంగా గోల్స్ వేసి క్రీడాకారుల్లో ఎమ్మెల్యే జోష్ నింపారు. సుధాకర్ బాబు మాట్లాడుతూ  క్రీడల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఆ ఆటలో తెరుగులేని వ్యక్తిగా నిలిచిన వాటిని ఆదర్శంగా తీసుకొని అవకాశం కోసం ఎదురుచూడాలని అన్నారు. క్రీడల పరంగా పిల్లలను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి కి అభినందనలు తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సహజం అని.. ఫలితం కోసం జట్టుగా అందరినీ ఐకమత్యంగా రాణిస్తేనే విజయం వరిస్తుంది అన్నారు. శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూహై స్కూల్ పీఈటీ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఇప్పటికే 30 మంది బాలికలను జాతీయ స్థాయికి తీసుకెళ్లారు అన్నారు. పిల్లలు చదివితే చాలు, మార్కులు వస్తే చాలని తల్లిదండ్రులు అనుకోవద్దని సూచించారు. ఎంతో మంది ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. మానసిక ఒత్తిడి ఆత్మహత్యలకు దారి తీస్తుందన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించే ఒకే ఒక్క మార్గం క్రీడలు అన్నారు. మనసు పుస్తకం మీద ఉండాలి అంటే క్రీడలు చాలా ముఖ్యం అన్నారు.

మంచి పౌరుడిగా ఎదగాలి అంటే.. ఎలా మెలగాలో క్రీడల వల్ల నేర్చుకోవచ్చు అని సూచించారు. ప్రస్తుతం ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్న వారు బాస్కెట్ బాల్ ప్లేయర్స్ అని తెలిపారు.  ఉద్యోగ అవకాశాల్లో కూడా క్రీడలు దోహద పడతాయి అన్నారు. నరసరవుపేట నుంచి చాలా మంది జాతీయ,  అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి అన్నారు.

కార్యక్రమంలో శాప్ సీఈఓ శ్రీనివాస రావు, పాఠశాల ప్రిన్సిపల్ సులేఖ, రాష్ట్ర షేక్ కార్పొరేషన్ ఛైర్మన్ ఖాజా వలి, ఆర్డివో శేషా రెడ్డి, డీఈవో గంగా భవాని, డిప్యూటీ డీఈవో సుధాకర రెడ్డి, ఏంఈవో జ్యోతి కిరణ్, ఎమ్ఈ మాల్యాద్రి, మున్సిపల్ డీఈ శ్రీనివాస రావు, సాప్ బాస్కెట్ బాల్ కో ఆర్డినేటర్ జగన్నాథ రెడ్డి, న్యూ బాస్కెట్ బాల్ అసోసియేషన్ గుంటూరు ప్రెసిడెంట్ రేవతి, సెక్రటరీ ఆంజనేయులు, వైసిపి రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్, 6వ వార్డ్ మాజీ కౌన్సిలర్ శంకరమ్మ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్

Related posts

ఏపి ఇన్ చార్జి సీఎస్ గా విజయానంద్

Satyam NEWS

రాజకీయ నేపథ్యంలో వస్తున్న సర్కారువారి పాట

Satyam NEWS

కుప్పంలో వైకాపా కుప్పిగంతులు: అది అడ్డగోలు గెలుపు

Satyam NEWS

Leave a Comment