38.2 C
Hyderabad
April 27, 2024 15: 49 PM
Slider నల్గొండ

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సమైక్యం పోరాటం

#roshapati

విద్యుత్ పోరాటంలో అమరులైన బషీర్బాగ్ డే సందర్భంగా వారి పోరాటం స్ఫూర్తితో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులు కార్మిక వ్యతిరేక విధానాలపై మరో పోరాటానికి సిద్ధం కావాలని సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శిల్పకళ బిల్డింగ్ కార్యాలయం నందు ముదిగొండ అమర వీరులకు విప్లవ జోహార్లు అర్పిస్తూ అమరులకు నినాదాలు చేసినారు.ఈ సందర్భంగా రోషపతి మాట్లాడుతూ అలనాటి పోరాటం మే ఆగస్టు 28 2000  సంవత్సరం నుండి దాదాపు పది సంవత్సరాల వరకు విద్యుత్ చార్జీలు పెరగలేదని గుర్తు చేశారు.ఉచిత విద్యుత్తు ఇప్పటికీ రెండు రాష్ట్రాలలో అమలు చేస్తున్నారని అన్నారు.ఈ విద్యుత్ పోరాటం ప్రపంచ పటంలోని మర్చి పోలేనిదిగా గుర్తింపు పొందిందని,ఆ పోరాటంలో తాను ప్రత్యక్షంగా పాల్గొనటం గర్వంగా ఉందని గుర్తు చేసుకున్నారు.

ఈనాడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్,రైల్వే,బొగ్గు గనులు,విద్యుత్, రోడ్లు,విశాఖ ఉక్కు ఇతర ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు వ్యక్తులకు,ప్రైవేటు సంస్థలకు అతి తక్కువగా ధారాదత్తం చేస్తుందని,వీటికి వ్యతిరేకంగా విద్యుత్ పోరాటాల స్ఫూర్తితో మరో పోరాటానికి పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పోరాటం కొరకు సమైక్యం కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు యలక సోమయ్య గౌడ్,  ఉప్పతల వెంకన్న,గోవిందు,ముస్తఫా,వేణు, నాగరాజు,వెంకన్న,కొండలు,నరేష్,బాబులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఈ ఫొటోలోని పాప బాగుందా? కానీ ఆ దుర్మార్గురాలికి….

Satyam NEWS

ఈ నెల 9 న నిర్వహించే ఆత్మగౌరవ సభను విజయవంతం చేయండి

Satyam NEWS

రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment