28.7 C
Hyderabad
April 27, 2024 05: 09 AM
Slider ఆధ్యాత్మికం

వైభవంగా విజయనగరం పైడతల్లి అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవం

#paiditalliammavaru

ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ పైడతల్లి అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవం… కడువైభవంగా..ఆలయ ఆస్థాన వ్యక్తుల అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కన్నులపండువగా జరిగింది. పైడితల్లి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 3 న వనంగుడి వద్ద చండీయాగం తో ఉత్సవాలు పూర్తి అవుతాయని ఆలయ ఈఓ కిషోర్ కుమార్ తెలిపారు. రాత్రి 09.30 కు ఆలయ పూజారి బంధువులు.. అమ్మవారి విగ్రహానికి ఆలయ వెనుక భాగంలో పూజ చేయించారు.

అనంతరం శాస్త్రోక్తంగా ఆలయ గర్భగుడి లోకి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకువచ్చారు. అక్కడే పూజారి బంటుపల్లి బంధువులు తో పూజలు చేసి..బయల ఏర్పాటు చేసిన ఉయ్యాల వద్దకు తీసుకువచ్చారు.అక్కడ పది గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వేద మంత్రోఛ్ఛరణల మధ్య తీసుకువచ్చి వైభవోపేతంగా పూజలు నిర్వహించారు. దాదాపు అరగంటసేపు ఆలయబయట పెట్టిన ఉయ్యాల లో అమ్మవారి పెట్టి…ఉత్సవం పూర్తి అయ్యాక… తదనంతరం ఉత్సవ విగ్రహాన్ని మరల దేవాలయం లోకి తీసుకెళ్లి పూజలు చేసి…మొత్తానికి ఉయ్యాల కంబాల ఉత్సవం అయ్యింది.

ఈ సందర్భంగా ఆలయ ఈఓ కిషోర్ కుమార్ మాట్లాడుతూ కన్నుల పండుగ గా ముగిసిందని…ఉదయం 8 గంటలకు వనంగుడి వద్ద జరగనున్న చండీయాగం తో పైడతల్లి అమ్మవారి ఉత్సవాలు పూర్తి అవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి తో పాటు మాజీ ఎంఎల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, ఆలయ ఈఓ కిషోర్ కుమార్, దేవస్థాన ఉద్యోగులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

వైభవంగా రామంతపూర్ బొడ్డురాయి 6వ వార్షికోత్సవ వేడుకలు

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: కటకటాల్లోకి విలేకరి, అతని స్నేహితులు

Satyam NEWS

అక్టోబర్ 21న ఫ్లాగ్ డే

Murali Krishna

Leave a Comment