32.4 C
Hyderabad
March 8, 2021 18: 03 PM
Slider ఆధ్యాత్మికం

ఘనంగా ముగిసిన సంపూర్ణ ‘కృష్ణ యజుర్వేద సప్తాహం

#Veda Saptaham

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల మట్టపల్లి మహా క్షేత్రములో పవిత్ర కృష్ణానదీ తీరాన స్వయంవ్యక్త  శ్రీలక్ష్మీ నృసింహ స్వామి వారి క్షేత్ర సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో గడిచిన వారం రోజుల నుండి శృంగేరి శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర స్వామివారి జన్మదిన సందర్భంగా కృష్ణ యజుర్వేద పారాయణ సప్తాహము ఘనంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వేద ఘనాపాటీలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.

ఈనెల 13 నుండి ప్రారంభమైన వేద సప్తాహం 19వ, తేదీ శుక్రవారం రాత్రితో పరిపూర్ణమైంది.సుమారు 25 మంది ఉద్దండ పండిత వేద ఘనాపాటీలు ఈకార్యక్రమంలో పాల్గొని కృష్ణ యజుర్వేద పారాయణం పూర్తి గావించారు.

చివరి రోజు వేద సభ నిర్వహించి పండితులకు ఘన సన్మానం నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వేదాభిమానులకు, విచ్చేసిన భక్తులకు వేద ఘనాపాటీలు ఆశీర్వాదం అందజేశారు.

ఈ సందర్భంగా బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం కన్వీనర్, కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షుడు, తదితరులు మాట్లాడుతూ పరమ పవిత్రమైన వేదాలు మానవ మనుగడకు ఎంతో కీలకమైనవని, వేదాలను కాపాడుకోవటం మనం బాధ్యత అన్నారు.పూర్వ కాలంలో మహర్షులు మనకు అందించిన వేదాలు నేడు వైజ్ఞానిక పరంగా ప్రామాణికమైనాయని, భారతీయ వేద గ్రంథాలను పాశ్చాత్యులు సహితం ఆయా భాషల్లోకి అనువాదం చేసుకొని అధ్యయనం చేస్తూ అనుసరిస్తున్నారంటే భారతీయ వేదాల సారం ఎంతో ఘనమైనదని చెప్పకనే చెబుతోందని,నేటి తరం వేద సారం తెలుసుకొని నిరంతర అధ్యయనం చేస్తూ వేదాభివృద్ధి చేయాలని కోరారు.

ఈకార్యక్రమంలో గుళ్ళపల్లి విశ్వనాథ ఘనాపాటి హైదరాబాద్,గుళ్ళపల్లి శివశర్మ శ్రౌతి ఘనాపాటి ఇరగవరం, చింతపల్లి ఆంజనేయ ఘనాపాటి విజయవాడ,ఫణిశర్మ మట్టపల్లి,దుర్భాకుల సాంబమూర్తి అవధాని నందిగామ, శ్రీనాధ్ శర్మ, మహాదేవ శర్మ,వేదం సూర్యనారాయణ శర్మ హైద్రాబాద్,

లక్ష్మీ నరసింహ వేదశాస్త్ర పాఠశాల స్మార్త,వేద విద్యార్థులు, మహబూబ్ నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి శ్రీమతి అనూరాధ, బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రము కమిటీ కన్వీనర్ నారపరాజు శ్రీనివాస రావు, కార్యదర్శి చెన్నూరు మట్టపల్లి రావు, కోశాధికారి బాచిమంచి గిరిబాబు,

ఉపాధ్యక్షుడు నారపరాజు పురుషోత్తమ రావు,పుల్లాభొట్ల శివ, సభ్యులు భువనగిరి శ్యాంసుందర్, ధూళిపాళ రామకృష్ణ,బొబ్బిళ్ళపాటి శేషు,నారపరాజు విజయకుమార్,పులిజాల శంకర్ రావు,దేవస్థాన అర్చకులు ఫణి,పద్మనాభాచార్యులు,ప్రసాద్ శర్మ, మట్టపల్లి,హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, తణుకు, నందిగామ, రాజమహేంద్రవరం మున్నగు ప్రాంతాల నుండి వచ్చిన వేద ఘనాపాటీలు,వేదాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

శిరోముండనం కేసులో ఎస్ ఐపై సస్పెన్షన్ వేటు

Satyam NEWS

విశాఖ ఆసుపత్రులపై గగనం నుంచి కురిసిన పూలు

Satyam NEWS

రూ.20 లక్షల రిలీఫ్ చెక్కులు అందించిన సిఎం

Satyam NEWS

Leave a Comment