38.2 C
Hyderabad
April 29, 2024 11: 53 AM
Slider ముఖ్యంశాలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయిన మత మార్పిడులు

#ViswaHinduParishad

హిందూ సమాజాన్ని  చీల్చి  భారతదేశాన్ని  విభజించేందుకు  కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు ముందుండాలని విశ్వహిందూ పరిషత్ అఖిల భారత సంఘటన మంత్రి వినాయకరావు దేశ్ పాండే సూచించారు.

సమాజంలోని అసమానతలను రూపుమాపేందుకు, కులాల మధ్య అంతరాన్ని చెరిపేసేందుకు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పని చేయాలని చెప్పారు. సోమవారం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా  వినాయకరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో మతమార్పిడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం, సామాజిక వర్గం, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని విదేశీ శక్తులు పరాయి మతస్తులు హిందువులను మతం మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

దుర్గామాతపై విద్వేషం నూరిపోస్తున్నారు

ఎస్సీ, ఎస్టీల కు   మాయమాటలు చెప్పి  భారతదేశం పైనే బురదజల్లే విధంగా  దుష్ట శక్తులు  విషయం నింపుతున్నాయి అని  పేర్కొన్నారు. అందులో భాగంగానే ఇటీవల కాలంలో దసరా రోజున రావణ దహనం కి బదులు రాముడి దహనం చేస్తున్నారని చెప్పారు.

దుర్గామాత ను ద్వేషిస్తూ మహిషాసుర రాక్షసులను పూజిస్తున్నారు అని వివరించారు. పెరిగిపోతున్న విదేశీ శక్తుల ఆగడాలను అడ్డుకునేందుకు కార్యకర్తలు శక్తికి మించి పని చేయాలని ఆయన సూచించారు. దేశం కోసం.. ధర్మం కోసం పని చేసే వారి సంఖ్య మరింత పెరగాలని చెప్పారు.

స్వశక్తులైన  కార్యకర్తలను గుర్తించి సంఘ కార్యంలో భాగస్వాములను చేయాలన్నారు. మరి ముఖ్యంగా అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం పూర్తయ్యేవరకు కార్యకర్తలు అకుంఠిత దీక్షతో పని చేయాలని పేర్కొన్నారు. సమాజం తో సంబంధాలు మరింత పెంచుకుని దేశ సేవ చేయాలని అన్నారు. 

వి హెచ్ పి రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్ జాతీయ  నాయకులతో పాటు రాష్ట్రంలోని ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఇందులో నాయకులు సత్యం జి, కేశవ హెడ్గే, కన్నా భాస్కర్, యాదగిరి రావు, రామరాజు, సురేందర్ రెడ్డి, 

జగదీశ్వర్, రాజేందర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, హెబ్బార్ నాగేశ్వరరావు, పగుడాకుల బాలస్వామి, వెంకటేశ్వర రాజు, కసిరెడ్డి వెంకటరెడ్డి, కృష్ణారెడ్డి, ఈ సంపల్లి వెంకన్న, భాస్కర్ రావు,

పుప్పాల వెంకటేష్, సోమన్న, శ్రీనివాస రాజా, సుభాష్ చందర్, శివ రాములు, కుమారస్వామి, వెంకట్ రెడ్డి,  నాగేశ్వరరావు, భాను ప్రకాష్, స్వామి, రాములు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Related posts

న్యాయస్థానాల లాక్ డౌన్ కొనసాగింపు

Satyam NEWS

బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి

Satyam NEWS

వామ‌ప‌క్షాల బంద్ పోలీసు బందోబ‌స్తు

Sub Editor

Leave a Comment