28.7 C
Hyderabad
April 26, 2024 08: 11 AM
Slider జాతీయం

జగన్ సాక్షిగానే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం

#DharmendraPradhan

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభ లో వెల్లడించారు.

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ పోస్కో ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్‌తో 2019 అక్టోబర్‌లో ఒప్పందం కుదిరిందని తెలిపారు.

ఒప్పందం తర్వాత సీఎం జగన్‌ను పోస్కో ప్రతినిధులు కలిశారని కేంద్ర మంత్రి చెప్పారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికే 3 సార్లు పోస్కో బృందం సందర్శించిన విషయాన్ని కేంద్రమంత్రి తెలిపారు. పోస్కో, ఆర్‌ఐఎన్‌ఎల్‌ మధ్య భూముల అప్పగింతకు ఒప్పందం కుదిరిందన్నారు.

పోస్కో ప్లాంట్ ఏర్పాటుకు జాయింట్ వర్కింగ్‌ గ్రూప్‌ను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త ప్లాంట్‌లో పోస్కో వాటా 50 శాతంగా ఉంటుందన్నారు.

ఆర్‌ఐఎన్‌ఎల్‌ వాటా ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదని సమాధానమిచ్చారు.

Related posts

వనపర్తి రూరల్ పోలీస్టేషన్ ను  తనిఖీ చేసిన వనపర్తి  డిఎస్పీ

Satyam NEWS

జడ్పీ మీటింగ్.. 5 నిమిషాలు: 2024-25 బడ్జెట్ ఆమోదం

Satyam NEWS

పంజాబ్ లో కెప్టెన్‌, కమలం మధ్య పొత్తు

Sub Editor

Leave a Comment