26.7 C
Hyderabad
April 27, 2024 10: 47 AM
Slider ప్రత్యేకం

కోన్ బనేగా కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్?…..ఆయనకే అవకాశం ఎక్కువ?

#kollapurmla

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ రాజకీయాలు చూస్తూనే వున్నాం. ఆ రాజకీయాలు  ఎలా వుంటాయి అంటే  ఎవ్వరిపైనో ఒకరిపై కేసులు కచ్చితంగా అవుతాయి. నియోజక వర్గ స్థాయి రాజకీయాలు ఇలా వుంటే. ఇప్పుడు ఒక నామినేట్ పదవి రెస్ రాజకీయం మొదలైంది. కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నేనంటే నేను అని తెగ హడావిడి చేస్తున్నారు. అంతే కాదు చర్చలను కూడా జరా హాట్ గానే నడిపిస్తున్నారు.

ప్రస్తుతం కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ రిజర్వేషన్  ఎస్టీ  వచ్చింది. దీనితో ఈ పదవి  ఎవరికి రాబోతుందో అని చర్చ జరుగుతుంది. గిరిజన ప్రజలలో, ఎమ్మెల్యే వర్గీయుల్లో ఉత్కంఠ రేపుతుంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ప్రస్తుతం ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఇదివరకు కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా జి. నరేందర్ రెడ్డి కొనసాగారు. ప్రస్తుతం ఆయన పదవీకాలం ముగియడంతో తర్వాత కాబోయే చైర్మన్ నేనంటే నేను అని కొందరు గిరిజన నాయకులు ఎవ్వరికీ వారు ప్రచారం  మొదలుపెట్టారు. అయితే  ఇప్పటివరకు ఎవరి పేరును ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రకటించలేదు.

తెరపైకి వచ్చిన ఇద్దరు

తెరపై మాత్రం ఇద్దరు వున్నారు. ఇప్పటి వరకు ఎవరికి డిక్లరేషన్ చేయలేదు. అందులో ఒకరు  నాకే పదవి వస్తుందని తెగ ప్రచారమైతే చేసుకుంటున్నారు. చైర్మన్ పదవి రేసులో ఇద్దరిలో ఎవ్వరిని వరిస్తుందో తెలియదు. వరించాలి అంటే  వారి క్యారెక్టర్, వారి సిన్సియారిటీ నీ బట్టి వరించవచ్చు. దీనిపైన ఎమ్మెల్యే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు ఇప్పటి వరకు ఆయన వెంట వున్నవారే. వీరిలో ఒకరు కోడేర్ మండలం నుండి కిషన్ నాయక్, మరొకరు పాన్ గల్ మండలం నుండి సోమ్ నాథ్ నాయక్ వున్నారు.

వీరిలో ఎవ్వరినీ  ఛైర్మెన్ పదవి వరిస్తుందో చూడాలి. ఇద్దరు ఎవరి ప్రయత్నం వారు బలంగానే చేస్తున్నారని సమాచారం. మొత్తం మీద ఒక ఉత్కంఠగా అయితే మారింది. ఎస్టీ రిజర్వేషన్ కావడంతో ఒక నామినేటెడ్ పదవులు గిరిజన బిడ్డలకు రావడమంటే శుభపరిణామం. కానీ ఇందులో  నిజాయితీ కలిగిన వారికి మాత్రమే అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే ఆలోచిస్తున్నట్లు వుంది.

నిజాయితీపరులకు మాత్రమే పదవీ బాధ్యతలు అప్పగించాలని ఇది అందరికీ ముఖ్యంగా గిరిజన ప్రజలకు ఆదర్శంగా వుండాలని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం.  యువత డిమాండ్ కూడా ఇదే వుంది. నిజాయితీ గల నాయకునికి పదవి ఇవ్వాలని డిమాండ్  చేస్తున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే దగ్గర కొందరు  ఇది వరకే చర్చించినట్లు సమాచారం.ఇక నిజాయితీ పరులు ఎవరనేది  ఎమ్మెల్యే నిర్ణయించాలి.

గిరిజనులకు సేవ చేసేవారు వస్తే మంచిది

సోమ్ నాథ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ నుండి గత 30 ఏళ్ళ నుండి రాజకీయం చేస్తున్నారు. వెంకటేశ్వరరావు, రామచంద్రరావు వంటి ఎమ్మెల్యేల దగ్గర పనిచేసిన అనుభవం ఉన్నది. తెల్లరాలా పల్లి గ్రామా( తండా)కు రెండు పర్యాయాలు సర్పంచ్ గా కొనసాగారనీ సమాచారం. అంతే కాకుండా సింగిల్విండో డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఆయన  ఎలాంటి మచ్చ లేకుండా గిరిజన ప్రజల అభివృద్ధి కొరకు కృషి చేశారనీ మాటలు వినిపిస్తున్నాయి. గిరిజన నాయకులు, యువత కూడా ఇయనకే మద్దతు పలుకుతున్నారని సమాచారం. ఎమ్మెల్యే నిర్ణయానికి  కట్టుబడి ఉండాల్సిందే అని కూడా  అంటున్నారు.

ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వర్గంలోని టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. మరొకరు కిషన్ నాయక్ ఉన్నారు. ఈయన కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. గతంలో కొడేర్ మండల జడ్పిటిసి గా అవకాశం వచ్చింది కానీ ఎన్నికలో ఓటమి చవి చూశారు. ప్రస్తుతం ఎస్టీ సెల్ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఈ మధ్యనే కిషన్ నాయక్ పై సోషల్ మీడియా వేదికగా గిరిజన యువత విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అమాయక గిరిజన ప్రజలపై అక్రమ కేసులు పెట్టించడమే కాకుండా, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.

గతంలో లోన్లు ఇప్పిస్తామని గిరిజన ప్రజలతో డబ్బులు దండుకున్నారు,ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తున్నారు. గిరిజన ప్రజలను మోసం చేసిన నాయకుడు ఛైర్మెన్  ఎలా అవుతారని  సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ చర్చలతో పోలీస్ పిర్యాదు వరకు వెళ్లారని సమాచారం. మరి కొందరు కిషన్ నాయక్  ఛైర్మెన్ కావాలని కూడా  డిమాండ్ చేస్తున్నారని సమాచారం. అయితే టిఆర్ఎస్ లో ఎస్టీ సెల్ లేదు. కిషన్ నాయక్ ఎస్టీ సెల్ పెట్టుకొని గిరిజన ప్రజలను  నమ్మిస్తున్నరాని   ఆరోపణలు వస్తున్నాయి.

ఛైర్మెన్ ఫైనల్ అయింది.వైస్ చైర్మన్ కోసం ఆలస్యం అయింది.మూడు రోజుల్లో  ఎమ్మెల్యే ప్రకటన చేస్తారని  వ  కిషన్ నాయక్ ధీమాలో వున్నారు.నిజాయితీకి అవకాశం వుంటుందని సోమ్ నాథ్ నాయక్   ధీమాలో వున్నారు. మొత్తం మీద ఇద్దరిలో  కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఏ గిరిజన బిడ్డను ఎమ్మెల్యే  నియమిస్తారో చూడాలి.మెజారిటీ ప్రజల అభిప్రాయ మేరకే ఎమ్మెల్యే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకోబోతున్నారనీ మాటలు వినిపిస్తున్నాయి.

అవుట రాజశేఖర్ సత్యం నెట్ కొల్లాపూర్

Related posts

బ్రాహ్మణుల శాపానికి జగన్ బలికాకతప్పదు

Satyam NEWS

రాజంపేటలో కంటి ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రం?

Satyam NEWS

ఉత్సాహంగా శ్రీకాకుళం జిల్లా స్థాయి సీనియర్ ఫెన్సింగ్ పోటీలు

Satyam NEWS

Leave a Comment