38.2 C
Hyderabad
April 29, 2024 13: 22 PM
Slider సంపాదకీయం

చంద్రబాబు అరెస్టుపై మౌనమేల స్వామీ?

#chandrababu

సినీ రంగానికి నారా చంద్రబాబు నాయుడు చాల ప్రాధాన్యత ఇచ్చారు.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ రంగానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించారు.. అటువంటి  సినీ ప్రముఖులు నేడు ఎందుకు చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడం లేదు.. ఖండన చేయనవసరం లేదు కనీసం అరెస్ట్ పై కూడా కామెంట్, ట్విట్ లు కూడా చేదాం లేదు. సినీ రంగం నుంచి దర్శకేంద్రడు రాఘవేంద్ర రావు, నట్టి కుమార్ , నిర్మాత అశ్వినీదత్ మినహా ఎవరు స్పదించలేదు. నట్టి కుమార్ సైతం చంద్రబాబు అరెస్ట్ పై చిత్ర పరిశ్రమ ప్రముఖులు స్పదించాలని కోరారు. సినీ రంగానికి , రాజకీయానికి సంబంధం ఉన్న పవన్ కళ్యాణ్, నందమూరి బాల కృష్ణ లు ఇప్పటికే ఈ విషయంపై స్పందించారు.

రాజకీయాలతో సంబంధం లేకుండా చంద్రబాబు సన్నిహత్యంగా ఉండే .. ఎస్. ఎస్ రాజమౌలి కుటుంభం , బోయపాటి, మెగాస్టార్ చిరంజీవి , ప్రభాస్, జగపతి బాబు లతో పాటు పలువురు  ప్రముఖులు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు.. చంద్రబాబు అరెస్ట్ ను వీరు ఖండించలేకున్నా , మద్దతు తెలపాకున్న పర్వాలేదు కానీ.. కనీసం స్పదించకపోవడం విడ్డురంగా ఉంది.. వైకాపా ప్రభుత్వానికి భయపడ్డారా… ?

వైకాపా అధికారం చేపట్టిన నాటి నుండి సినీ రంగాన్ని ఇబ్బంది పెట్టిందే తప్ప.. పెద్దగా చేసింది ఏమి లేదు.. ప్రముఖులు సైతం జగన్ వద్ద వెళ్లి నమస్కారాలు చేసి వచ్చిన .. పెద్ద ఫలితాలు లేవు అనుకోండి .. ఆ విషయం వాళ్లకు తెలుసు.. వైకాపా మంత్రులు సైతం పకోడీ గాళ్ళు అంటూ సెటైర్లు వేసిన పెద్దగా పట్టించుకోలేదు అనుకోండి.. మరి ఎందుకు ఈ మౌనం? అన్నిటికి మించి జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయం పై స్పదించకపోవడమే .. పెద్ద ప్రశ్న గా మిలిపోయింది. టీడీపీ కి జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధ లేదా .. ? కట్టే కాలే వరకు తాను టీడీపీ అన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు..  మొన్న తన అత్తా భువనేశ్వరి  విషయం లో స్పందించిన తీరు కూడా చాల పేలవంగా ఉంది. అసలు స్పదించకపోతే నే బెటర్ అనే స్థాయి లో స్పదించారు. జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయ మరకలు అంటించాలి అనే ఉద్దేశం ఎవరికీ లేదు.. చంద్రబాబు స్వయానా జూనియర్ ఎన్టీఆర్ కు మామా .. జూనియర్ టీడీపీ కుటుంభ సభ్యుడు … ఖచ్చింతంగా స్పదించాల్సిన సమయంలో జూనియర్ మౌనం దేనికి సంకేతం? టీడీపీ కి జూనియర్ ఎన్టీఆర్ దూరం ఎంత.. చంద్రబాబు తో ఏమైనా ఇబ్బందా … ఏది ఈమైన జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ లో ఓ అంతర్భాగం అనే విషయాన్ని మరిచిపోకూడదు.

జూనియర్ ఎన్టీఆర్ ఇప్పడు సినీ రంగం లో మహారాజు కావచ్చు .. 50 ఏళ్ళు దాటాక ఖచ్చితంగా అడుగులు రాజకీయాల వైపే .. అందుకు ఆయన 2009 లో టీడీపీ ప్రచార రాధ సరిదిగా.. పెద్ద ఎన్టీఓడే భూలోకానికి వచ్చి మాట్లాడుతున్నాడా అని ప్రతి టీడీపీ అభిమాని అనుకున్నారు.. ఆనాడు జూనియర్ ప్రచారాన్ని చూసి..  ఆ రక్తం లోనే ఉంది ప్రజలకు ఎదో చేయాలనే కసి పట్టుదల.. అందుకే ఆ నాడు ఎన్టీఆర్ టీడీపీ ని స్థాపించి ప్రజలకు ఎంతో మేలు చేసి.. పేదల చిరు నవ్వుల్లో.. ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.. ఆ మహానుభువుని  రక్తానివి నువ్వు.. మరి ఎందుకు నీ మౌనం?

నా కెందుకులే ఈ గొడవ అనుకుంటున్నారా .. ఏది సరైన సమయం కాదు అనుకుంటున్నారో .. మీరు ఇప్పుడే స్పందిస్తేనే .. టీడీపీ కేడర్ మీకు అమితమైన అభిమానం తక్కేది.. ఇప్పటికే నిజమైన టీడీపీ వాడి .. టీడీపీ జెండా పట్టుకొని మోసిన కార్యకర్తల్లో ఎక్కడో చిన్న అనుమానం జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ దూరం అవుతున్నారా  అని… ఇటువంటి అనుమానాలు , అపవాదులు పోగొట్టాలన్న.. నాది టీడీపీ నే .. నేనే టీడీపీ.. టీడీపీయే నేను అనే రీతిలో స్పదించాల్సిన సమయం ఇది … చంద్రబాబు కు మద్దతు ఇవ్వమనో .. లేక మీరు స్పదించకపోతే ఎదో జరిగిపోతుంది అనేది కాదు ఇక్కడ సారాంశం … ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు .. ఖండించకపోవడం, కనీసం స్పదించకపోవడం … ట్విట్ కానీ.. పోస్ట్ గానీ చేయకుండా ఉండడమీ టీడీపీ అభిమానాలను బాధిస్తున్న అంశం అనేది జగం ఎరిగిన సత్యం …

పూడి రామకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్

Related posts

హోసూర్‌-బెంగుళూరు మధ్య మెట్రోరైలు

Murali Krishna

వైసీపీ నార్త్ అమెరికన్ అధికార ప్రతినిధి రత్నాకర్ ఆపన్న హస్తం

Satyam NEWS

కార్మికుల శ్రమను గౌరవిద్దాం

Satyam NEWS

Leave a Comment