30.2 C
Hyderabad
September 14, 2024 15: 47 PM
Slider ప్రత్యేకం సినిమా

సైరా చిత్రం చూడాలని విఐపిలను ఎందుకు అడుగుతున్నారు?

syra-narasimha-reddy-first-day-collections

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని మెచ్చుకున్నారు. కథా పరంగా కొందరు కొన్ని చిన్న చిన్న అభ్యంతరాలు వ్యక్తం చేసినా కూడా చిత్రం ఆద్యంతం ఆసక్తిగానే ఉందని విమర్శకులు కూడా శెభాష్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు పరిమితికి మించిన షో లకు అనుమతులు కూడా ఇచ్చాయి. దాంతో చిత్ర నిర్మాత, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ గట్టెక్కాడని అనుకున్నారు. అయితే కథ మరోలా ఉందని సమాచారం.

సైరా నరసింహారెడ్డి చిత్రం తీయడానికి దాదాపు 180 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఒక అంచనా. దీనికి తోడు మరో 20 కోట్లు చిత్రం పబ్లిసిటీ పై ఖర్చు చేశారు అంటే 200 కోట్ల రూపాయలు ఈ చిత్రంపై చేసిన మొత్తం ఖర్చు అన్నమాట. ఏడు రోజుల కలెక్షన్లు చూస్తే 189.2 కోట్లకు మించి రాలేదని ఒక అంచనా. హిందీ, తమిళ్, తెలుగు మూడు భాషల్లో కలిపి వచ్చిన కలెక్షన్లు ఇవి. మొదటి రోజు 60.6 కోట్ల రూపాయల మేరకు వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం దసరా పండుగ సీజన్ కావడంతో ఆ తర్వాతి రోజుల్లో కూడా దాదాపుగా అంతే స్థాయిలో వసూళ్లు రాబట్టింది కానీ రాను రాను చిత్రం స్టామినా తగ్గిపోతున్నది.

దాంతో పెట్టిన పెట్టుబడికి బ్రేక్ ఈవెన్ రావడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో మొత్తం 1200 స్క్రీన్ లపైనా, ఉత్తర భారత దేశంలో 2800 స్క్రీన్ లపైనా ఈ చిత్రం విడుదల అయింది. అంటే దాదాపుగా 4 వేల ధియేటర్లలో సినిమా విడుదల అయింది. ఇంత భారీ చిత్రం కనీసం 300 కోట్లు వసూలు చేస్తే కానీ నిర్మాతలకు చేతి డబ్బులు పడకుండా ఉండవు. అయితే ఆ అవకాశం కనిపించడం లేదని తేలిపోయింది. భారీ నష్టాలను చవి చూసే దిశగా సైరా చిత్రం వెళుతుండటంతో చిరంజీవి, రామ్ చరణ్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వం లోని పెద్దలకు చిత్రాన్ని చూపించి పన్ను మినహాయింపు పొందాలని వారు యోచిస్తున్నారు. అందుకే ప్రభుత్వ పెద్దలను చిత్రం చూసేందుకు ఆహ్వానిస్తున్నారు. త్వరలో కేంద్ర మంత్రులందరికి కూడా ఈ చిత్రాన్ని చూపించేందుకు చిరంజీవి, రామ్ చరణ్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

Related posts

హమ్మయ్య చిరుతపులి అడవిలోకి వెళ్లిపోయింది

Satyam NEWS

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజున రక్తదాన శిబిరం

Satyam NEWS

పిన్నెల్లి అరెస్టు పై కేంద్ర ఎన్నికల సంఘం ఆసక్తికర వ్యాఖ్య

Satyam NEWS

Leave a Comment