38.2 C
Hyderabad
April 28, 2024 19: 31 PM
Slider విశాఖపట్నం

రెడ్డి ఐఏఎస్ లను ఎందుకు అరెస్టు చేయడం లేదు?

#atchannaidu

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అప్పటి బాధ్యులైన ఐఏఎస్ అధికారులు అజయ్ కల్లాం రెడ్డి, ప్రేమచంద్రారెడ్డి పేర్లు ఎందుకు పెట్టలేదని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడు పై అక్రమ కేసులు పెట్టి జైల్ లో పెట్టి సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో చట్టం లేదు న్యాయం లేదు. నిన్నటి తో జగన్ పిచ్చి పరాకాష్ట  కు చేరింది. ప్రపంచం లో ఎవరు అడిగినా చెబుతారు….చంద్రబాబు విజన్, పాలన ప్రత్యేకత గురించి. చంద్రబాబు పారిపోయే వ్యక్తి కాదు. కేంద్రం ఎన్ ఎస్ జి రక్షణ ఉన్నా ఆయనను అరెస్ట్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇది చీకటి రోజు అని ఆయన అన్నారు.

371 కోట్లు అవినీతి జరిగిందని, డబ్బు దారి పట్టిందని ఒక ఊహ లోకం ఊహిస్తున్నారు… నంద్యాల నుంచి కారు లో విజయవాడ కు రోడ్ మార్గం లో అంత పెద్దమనిషిని తీసుకొచ్చారు. నానా హింసలు పెట్టారు. రెండు రోజులు ఇబ్బందులు పెట్టారు. సీఐడి చీఫ్ ప్రెస్ మీట్ లో చెప్పారో అదే రిమండ్ రిపోర్ట్ లో పెట్టారు. అప్పుడు నేను మంత్రిగా లేను. ముందు విద్య శాఖ లో స్కిల్ డెవలప్మెంట్ ఉండేది. తదుపరి కార్మిక శాఖ లోకి అనుసంధానం చేశారు అని అచ్చెన్నాయుడు తెలిపారు.

ఐదేళ్లు ఆ ప్రొజెక్టు వల్ల ఎంతో మంది యువకులు భవిష్యత్ పొందారు..స్వయంగా సి ఐ డి చీఫ్ అదే విషయం చెప్తున్నారు. కేవలం రాజకీయ కక్ష తో ఈ కేస్ పెట్టారు.. జగన్ అవినీతి కప్పి పుచ్చుకోవడానికి ఈ పని చేశారు అని ఆయన అన్నారు. ఈ కేసు కు సంబంధం లేని వ్యక్తిని అరెస్ట్ చేస్తారా. ఆరోజు ఈ ప్రాజెక్ట్ అమలు చేసిన వారి పేర్లు ఎందుకు ప్రస్తావన చెయ్యలేదు. నేను బలహీన వర్గాలు వాడినని నా పేరు పెట్టారు. నేను గాని, నా కుటుంబ సభ్యులకు ఒక్క రూపాయి వచ్చిందని నిరూపిస్తే పీక కోసుకుంటా.. చంద్రబాబు గారు గాని వారి కుటుంబ సభ్యులు గాని ఒక్క రూపాయి తీసుకున్నారని నిరూపిస్తే పీక కోసుకుంటా, రాజకీయం నుంచి తప్పుకుంటా అని ఆయన అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఏ నాటకం అడమంటే అదే చేస్తారా పొలీసు అధికారులు.. ఇది ధర్మమా న్యాయమా..అని ఆయన ప్రశ్నించారు.

Related posts

ఆకాశంలోకి దూసుకుపోతున్న టమాటా ధరలు

Satyam NEWS

మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

Satyam NEWS

తెలంగాణ లో 2 కోట్ల టెస్టింగ్ కిట్ లు, 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్ లు

Satyam NEWS

Leave a Comment