26.7 C
Hyderabad
April 27, 2024 09: 58 AM
Slider మహబూబ్ నగర్

గేట్ ధర్నా కు దిగిన కల్వకుర్తి న్యాయవాదులు

#KalwakurthyAdvocates

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో పెద్దపల్లి జిల్లాలో జరిగిన హై కోర్ట్ అడ్వకేట్ దంపతుల హత్య కేసును సిబిఐకి అప్పగించాలని తెలంగాణ ఫెడరేషన్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు శుక్రవారం పట్టణ న్యాయవాదులు కల్వకుర్తి మెజిస్ట్రేట్ కోర్టు ముందు గేట్ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సి. కృష్ణయ్య మాట్లాడుతూ వామనరావు దంపతుల హత్య ను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వామనరావు దంపతుల హత్య పై సిబిఐ దర్యాప్తు జరిపించాలని హత్యకు పాల్పడిన పాత్రధారుల తో పాటు సూత్రధారులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అదే విధంగా న్యాయవాదులపై దాడులకు పాలు పడకుండా ప్రత్యేక చట్టం చేయలన్నారు. మార్చి 9న న్యాయవాదులు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మార్చి 1వ తేదీ నీ నుండి మూడవ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

న్యాయవాదుల హత్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. దర్యాప్తులో నిజానిజాలు తెలియాలంటే  సిబిఐ విచారణ ఒక్కటే మార్గమని  ఆయన తెలిపారు

ఈ కార్యక్రమంలో బి వెంకట రెడ్డి జై లక్ష్మీ నారాయణ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ భాస్కర్ రెడ్డి వెంకటేశ్వరరావు అమరేందర్ జమీల్ లక్ష్మణ్ రాజ్ రామ్ గోపాల్ నరేందర్ రెడ్డి  వెంకటేష్ మల్లేష్ నాగరాజు రామకృష్ణ శేఖర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

Related posts

పెళ్లి వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి సతీమణి శోభారాణి

Satyam NEWS

కాండిల్ లైట్: ఘనంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి

Satyam NEWS

పగిలిన మంచినీటి పైపులైన్లు తక్షణమే రిపేర్ చేయాలి

Satyam NEWS

Leave a Comment