26.7 C
Hyderabad
April 27, 2024 08: 35 AM
Slider సంపాదకీయం

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమౌతున్న ఏపి ప్రభుత్వం

jagan 02

స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి రాష్ట్రంలోని 676 మండలాలలో ఆదివారం నాటికి కేవలం 40 మండలాలు మాత్రమే రెడ్ జోన్లు గా ఉన్నాయి. మరో 45 జోన్లు ఆరెంజ్ జోన్లుగా ఉన్నాయి.

మిగతావి గ్రీన్ జోన్లు గానే ఉన్నాయి. అంటే ఆ మండలాలలో కరోనా వైరస్ వ్యాప్తి లేదు. అందువల్ల అవి సురక్షిత మండలాలుగానే ఉన్నాయి. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో కూడా చెప్పారు.

కేవలం రెడ్ జోన్ లలో మాత్రమే పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధిస్తే సరిపోతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు కూడా. ఆరెంజ్ జోన్లలో కొన్ని సెక్టార్లను మాత్రమే కట్టడి చేస్తే సరిపోతుంది. ఇక గ్రీన్ జోన్ ల విషయానికి వస్తే ఎలాంటి అవరోధాలు కల్పించాల్సిన అవసరం లేదు.

అంటే దాదాపుగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిలిచి పోయినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కర్నూలులో అత్యధికంగా 8 రెడ్ జోన్ లు ఉన్నాయి. మిగిలిన వాటి విషయానికి వస్తే నెల్లూరులో 5 చిత్తూరు, ప్రకాశం జిల్లాలలో 4 చొప్పున గుంటూరులో 3 జోన్లు మాత్రమే రెడ్ లో ఉన్నాయి.

ఆరెంజ్ జోన్ లలో పెళ్లి లాంటి పెద్ద స్థాయిలో ప్రజలు గుమికూడే ఫంక్షన్లకు కూడా అనుమతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను మార్చేసి నూతన కమిషనర్ ను నియమించడం ఆయన పదవి బాధ్యతలు స్వీకరించడం కూడా జరిగిపోయాయి.

ఇప్పుడు కరోనా విషయంలో కూడా స్పష్టత వచ్చేసినందున ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలాంటి ప్రతిబంధకం ఉండకపోవచ్చుననేది అంచనా. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగ రాజ్ తర్వలో రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా పై లేఖ రాస్తారని భావిస్తున్నారు. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం పైన చెప్పిన వివరాలతో ప్రత్యుత్తం ఇచ్చేస్తే ఇక మిగిలిపోయిన ఎన్నికల ప్రక్రియను కొనసాగించేందుకు తగిన నిర్ణయం తీసుకోవడానికి ఎన్నికల కమిషనర్ కు వీలు కలుగుతుంది.

 శాంతిభద్రతల అంశంలో గత ఎన్నికల కమిషనర్ రాసిన లేఖకు ఇప్పటి వరకూ కేంద్రం నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇక ఆ అంశం ముగిసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఏకగ్రీవ ఎన్నికలు పోను మిగిలిన చోట్ల ఎన్నికలు నిర్వహించడానికి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. షెడ్యూలు కొద్దిగా మార్పులు చేసి ఉపసంహరణకు గడువు ఇస్తే మరిన్ని చోట్ల నామినేషన్లు ఉపసంహరించుకునే వీలు ఉంది. ఇలా చేస్తే ఏకగ్రీవాలు మరిన్ని పెరిగి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండకపోవచ్చు.

Related posts

మతి తప్పి మాట్లాడుతున్న ఇమ్రాన్

Satyam NEWS

YSR తెలంగాణ పార్టీ సింగిల్ కో-ఆర్డినేటర్ గా దొంతమాల

Satyam NEWS

ఈ సారి పోలీసు స్పందనకు వచ్చిన ఫిర్యాదులెన్నో తెలుసా..

Satyam NEWS

Leave a Comment