40.2 C
Hyderabad
April 26, 2024 11: 18 AM
Slider ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టు పరిశీలన

#AndhraPradeshHighCourt

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందా అనే అంశంపై హైకోర్టు పరిశీలన జరపాలని నిర్ణయించింది. రాష్ట్ర హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పాస్ పిటిషన్లను విచారించే సందర్భంగా రాష్ట్ర హైకోర్టు, ఈ పిటిషన్లను రాజ్యాంగ ఉల్లంఘన కిందికి తీసుకోవాలా అనే అంశాన్ని పరిశీలిస్తున్నది.

జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవి లతో కూడిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను పరిశీలించిన తర్వాత బెంచ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుని ప్రభుత్వ న్యాయవాదులు ఈ మేరకు తమ అభిప్రాయాలను తెలియచేయాలని కోరింది.

వచ్చే హియరింగ్ తేదీ నాటికి ప్రభుత్వ న్యాయవాదులు రాజ్యాంగ ఉల్లంఘన పై తమ అభిప్రాయాలను తెలియచేయాలని హైకోర్టు కోరింది. రాష్ట్ర హైకోర్టు బెంచ్ చాలా కేసులను పరిశీలిస్తున్నది. నిన్న జస్టిస్ రాకేష్ కుమార్ ముందుకు వచ్చిన మూడు రాజధానుల అంశంపై పలు వ్యాఖ్యానాలు చేశారు.

మూడు రాజధానుల వ్యవహారం ‘‘తల లేని’’ వ్యవహారమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర హైకోర్టు ను కర్నూలుకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ ప్రస్తుతం న్యాయస్థానం నడుస్తున్న భవనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా వ్యాఖ్యానించారు.

Related posts

అమ్మ కొంగు

Satyam NEWS

పంచారామాల దర్శనం కోసం మీ ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు…

Satyam NEWS

గ్రూప్ రాజకీయాలకు తావులేకుండా ఉప్పల్ లో బండారిని గెలిపిస్తాం

Satyam NEWS

Leave a Comment