32.7 C
Hyderabad
April 27, 2024 02: 39 AM
Slider ప్రత్యేకం

కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఏడుసార్లు విద్యుత్ ఛార్జిల పెంపు

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తుత తిక్క ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ల చేతగాని తనం వల్ల రాష్ట్రంలో డిస్కంలు దివాలా తీసాయని రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ కార్యాలయంలో సాక్షి దినపత్రికలో రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవంటూ ప్రచురితమైన కథనానికి స్పందిస్తూ నేడు 20-05-2023వ తేదీ శనివారం నాడు సాక్షి పత్రికను చూపిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిక్క ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పదవి చేపట్టినప్పటి నుంచి టారీఫ్ ల కుదింపు, స్లాబుల మార్పు ,ఫిక్స్డ్ చార్జీలు, అదనపు డిపాజిట్లు, అదనపులోడు ఎసిడి ల పేర్లతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఇటు ప్రజలు అటు రైతులు విద్యుత్ వినియోగదారులపై రూ.57.18 కోట్ల అదనపు భారం మోపి వారి నడ్డి విరిచి వారిని ఎప్పటికీ కోలుకో లేకుండా చేశాడని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో ఉన్నటువంటి 11 కెవి, 220 కెవి తదితర సబ్ స్టేషన్ లకు వెళ్లి రికార్డులను పరిశీలిద్దాం ,అక్కడ రికార్డుల్లో కోతలు విధించలేదని ఉంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దీనికి సిద్ధమేనా?అని ఆయన సవాల్ విసిరారు.

సాక్షి దినపత్రికలో ఒక్క తేదీ తప్ప మిగిలినవి అన్ని అబద్దాలే రాస్తారని జగన్ రెడ్డి తల్లి విజయమ్మ ఇటీవల చెప్పింది అన్నారు. కావాలంటే పేపర్ పైనే సత్యమేవ జయతే ఉంటుందని దాన్ని అసత్యమేవ జయతే అని పెడితే బాగుంటుందని ఎందుకంటే నిత్యం పేపర్లో రాసేవని అసత్యాలే కాబట్టి అని విజయమ్మ గారు తెలిపారని అన్నారు.

సైకో ముఖ్యమంత్రి కమిషన్ల కోసం కరెంటు కృత్రిమ సమస్య సృష్టిస్తూ బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విద్యుత్తును కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు., అవినాష్ రెడ్డి బినామీ కంపెనీ అయిన శిరిడి సాయి ఎలక్ట్రికల్ వద్ద రూ. 60000 ధర ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు 1.30 లక్షలు వెచ్చించి ఎందుకు కొంటున్నారని ప్రశ్నించారు.

అదేవిధంగా 18 వేల రూపాయలు ఉన్న స్మార్ట్ మీటర్ ను రూ.30000 కొనుగోలు చేస్తూ 12వేల కోట్ల రూపాయలు కమిషన్లు జగన్ రెడ్డి కొట్టేస్తున్నాడని ఆరోపించారు. తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చేతగానితనం వల్ల యూనిట్ ధర రూ.16 లకు కొని డిస్కంలను రూ.6600 కోట్లు నష్టాల్లోకి నెట్టిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిది అని ఆరోపించారు.ఆయన నిర్వహకం కారణంగా బ్యాంకులో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఈరోజు డిస్కములు దివాలా తీసాయని విమర్శించారు.

విద్యుత్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం సోలార్ విండో పవర్ను కొనుగోలు చేయకుండా కమిషన్ల కోసం బహిరంగ మార్కెట్లో యూనిట్ ను పది రూపాయలకు పైగా కొంటూ రోజుకు పది కోట్లు భారం మోపుతున్నారని తెలిపారు., అసలు థర్మల్ ఫ్లవర్ స్టేషన్లో సామర్థ్యానికి తగ్గట్టుగా విద్యుత్తును ఉత్పత్తి చేయడం లేదని విమర్శించారు.

ఎన్.టి.పి.ఎస్ లో బ్రేక్డౌన్ కారణంగా ఆరు యూనిట్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, కేవలం ఒక్క యూనిట్లో మాత్రమే ప్రస్తుతం ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు., మొత్తం 1760 మెగావాట్లుగాను ప్రస్తుతం కేవలం 500 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు.

ప్రతి వేసవి సీజన్లో సాంకేతిక కారణాలు చెప్పడం జగన్ చేతగానితనానికి నిదర్శనమని తెలిపారు. కమిషన్ల కోసం తన బినామీ కంపెనీలైన శిరిడి సాయి, హిందూజాలకు దోచి పెడుతూ విద్యుత్తు రంగాన్ని సర్వనాశనం చేశాడని ఆరోపించారు. హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్.ఎన్.పి.సి.ఎల్ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయకుండానే స్థిరచార్జిల పేరుతో ఆ కంపెనీకి రూ. 2834 కోట్లు చెల్లించాలని తిక్క ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిందని విమర్శించారు.

సీఎం జగన్ రెడ్డి సొంత లాభం కోసం అప్పులు చేస్తూ ఆ భారాలను విద్యుత్ వినియోగదారులపై మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తగినన్ని బొగ్గు నిలువలు ఉంచకుండా బహిరంగ మార్కెట్లో అధిక ధరల విద్యుత్తు కొనుగోలు చేస్తూ వినియోగదారుల నడ్డి విరుస్తూ వారిని కోలుకోలేకుండా చేస్తున్నాడని తెలిపారు.

73 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో 20 మంది ముఖ్యమంత్రి ఉత్పత్తి చేస్తే చంద్రబాబు నాయుడు ఒక్కరే 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారని గుర్తు దేశంలోనే మొదటిగా ఆశయాలోనే అతిపెద్ద అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్లాంట్ ను కర్నూల్ లో స్థాపించి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లోటును అధికమించి కోతలు లేని 24 గంటల నాణ్యమైన విద్యుత్తు అందించిన ఏకైక ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు పేరు తెచ్చుకున్నారని చెప్పారు.

రాష్ట్ర విభజనతో ఏర్పడిన 22.5 మిలియన్ల విద్యుత్తు లోటును వంద రోజుల్లో అధికమించిన నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ విజనరీ చంద్రబాబు నాయుడు అని తెలిపారు., అదేవిధంగా మిగులు విద్యుత్ ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు విక్రయించి లాభాలు సాధించిన ఘనత చంద్రబాబు దేనని గుర్తు చేశారు.

ప్రస్తుతం జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్టేషన్స్ సి.జి.ఎస్ కొనుగోలు ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు.

ప్రస్తుతం విచ్చలవిడిగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధిస్తూ పైగా కోతలు లేని కరెంటు ఇస్తున్నామని సాక్షిలో కథనాలు రాయడం విడ్డూరంగా ఉందని తెలిపారు., ఇలా తప్పుడు కథనాలు రాస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించి చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తామని హెచ్చరించారు.

వెంటనే తిక్క ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన సైకో పద్ధతి మార్చుకొని రాష్ట్ర ప్రజలకు, రైతులకు కోతలు లేని కరెంటును తక్కువ ధరలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ కొనుగోలు అవినీతిపై ఒప్పందాల పైన విచారణ సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జిలను వెంటనే తగ్గించాలని అవినీతి కోసం రైతుల మోటార్లకు బిగిస్తున్న మీటర్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు., అలాగే లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా టిడిపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పదాధికారులు పాల్గొన్నారు.

Related posts

శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటాం

Bhavani

పేదలు ఆర్థికంగా బలపడేలా అభివృద్ది పథకాలు

Satyam NEWS

ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి

Satyam NEWS

Leave a Comment