35.2 C
Hyderabad
April 27, 2024 11: 49 AM
Slider విజయనగరం

పోరాటాలు లేకుండానే గిరిపుత్రుల హామీలన్నీ పూర్తి చేసాం

#pamula srivani

రాష్ట్ర సీఎం జగన్ ప్రభుత్వం గిరిజనులకు ఎన్నికల సమయంలో మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరిగిందని రాష్ట్ర డిప్యూటీ సీఎం గిరిజన శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. ఈ మేరకు పార్వతీ పురం ఐటిడీఏ పరిధిలో ప్రపంచ ఆది వాసీ దినోత్సవ సందర్భంగా ఓ బృహత్తర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీ వాణి హాజరై మాట్లాడారు. విద్య, వైద్యం, తాగునీరు, రహదారులకు పెద్ద పీట వేశామని చెప్పారు. గతంలో లాగా ఏ సమస్య పరిష్కారానికి కూడా పోరాటాలు చేయనవసరం లేకుండానే సీఎం అన్ని సమస్యలను పరిష్కరిస్తూ తాను గిరిజన పక్షపాతి అని నిరూపించు కుంటున్నారని కితాబిచ్చారు.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సోమవారం పార్వతీపురం ఐ.టీ.డీ.ఎ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గిరిజన సంఘాల నాయకులు సంప్రదాయబద్దంగా ముఖ్య ఆతిధికి స్వాగతం పలికారు,

అనంతరం ఐ.టీ.డీ.ఎ కార్యాలయ ఆవరణలో నున్న ఆడవితల్లి విగ్రహానికి నేతలందరూ పూలదండ వేసారు. ఇక  పార్వతీపురం ఎమ్మెల్యే అధ్యక్షత వహించిన ఈ సభలో డిప్యూటీ సీఎం  పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ ముందుగా  గిరిజనులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 500 కోట్ల రూపాయలతో గిరిజన ప్రాంతాల్లో వైద్య కళాశాల. కురుపాం నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల, సాలూరు నియోజకవర్గం లో సెంట్రల్ యూనివర్సిటీ మంజూరు చేసి గిరిజన ప్రాంతానికి అభివృద్ధి చేస్తున్నారన్నారు.

గిరిజన మహిళ నైన తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని,  సీఎం జగన్ ప్రతీ నిర్ణయం గిరిజనుల అభివృద్ధి  కోసమే తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఏ ఒక్క గిరిజన రైతు ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టా కోసం, సంక్షేమ పథకాలు కోసం ఎవ్వరూ రోడ్డు ఎక్కి పోరాటం చేయకుండా వారికి కావలసిన సంక్షేమ పథకాలు అందిస్తూ రెండు లక్షల పై చిలుకు ఆర్. ఓ.ఎఫ్ ఆర్ పట్టాలు అందించడమే కాకుండా వారికి రైతు భరోసా అందించే ఘనత మన సీఎం జగన్ దే అన్నారు. అలాగే గిరిజన ప్రాంతాలలో గర్భిణీల కు,బాలింతలకు, పిల్లలకు రాష్ట్రంలో 77 గిరిజన మండలాల్లో వై.ఎస్.ఆర్.సంపూర్ణ పోషణ ప్లస్ పథకం ద్వారా పోషక విలువలతో కూడిన ఆహారం అందించడం జరుగుతుంది అన్నారు. దేశంలోనే 5 అవార్డులు జీ.సీ.సీ. కైవసం చేసుకుంది అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  ఏ.సూర్యకుమారి మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలిపారు. నా మొదటి పోస్టింగ్  గిరిజన ప్రాంతమైన పాల్వంచ, నాకు గిరిజన సంప్రదాయం, సంస్కృతి చాలా ఇష్టం అన్నారు, గిరిజన ప్రాంతం అభివృధి చెందాలి అంటే ప్రధానంగా రోడ్స్ అవసరము అన్నారు. అలాగే గిరిజనుల వెనుకు బాటుతనం పోవాలి అంటే విద్య ప్రధానము  అన్నారు,

అందరూ తమ పిల్లలను స్కూల్ కి పంపించాలి అన్నారు.  ఆన్ని శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అన్నారు.ఈ  కార్యక్రమంలో ఎం.ఎల్.సి రఘు వర్మ మాట్లాడుతూ సీఎం జగనన్న గిరిజనుల అభివృద్ధి కి ఆహార్నిషలు కృషి చేస్తున్నారన్నారు.  సచివాలయాలు ఏర్పాటు చేసి  ప్రభుత్వం పథకాలు లబ్ధి దారునికి నేరుగా అందించేందుకు వలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి పేదవాడికి ఉపయోగ పడేలా సంక్షేమ పథకాలు తీసుకు వచ్చారన్నారు.

పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్ద కాలంగా పోడు వ్యవసాయం చేస్తూ విద్య, వైద్య మౌలిక సదుపాయాల కోసం ఎదురు చూస్తూ మా జీవితాలు బాగు చేస్తారు, మా కష్టాలు తీరుస్తారు అన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు అని ఎదురు చూస్తుంటారు.  గత పాలకుల నిర్లక్ష్యం వలనే డోలి వ్యవస్థ, రోడ్లు లేని గిరిజన గ్రామాలు ఉన్నాయన్నారు.  అన్ని కులాల వారికి, అన్ని వర్గాలవారికి, అన్ని వేళల్లో అందుబాటులో  ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యం అన్నారు.

సాలూరు ఎమ్మెల్యే పిడిక రాజన్న దొర మాట్లాడుతూ ముందుగా ఆందరికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం శుభకాంక్షలు తెలిపారు.  సీఎం జగన్ కావడం గిరిజనుల అదృష్టం ఆన్నారు. గిరిజనుల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ, అభిమానం గిరిజన మహిళకు గిరిజన శాఖ ,డిప్యూటీ సీఎం గా చేసి గిరిజనుల పట్ల వారికి ఉన్న అభిమానాన్ని తెలిపారు.  గిరిజనుల అభివృద్ధికి సీఎం, డిప్యూటీ సీఎం తీవ్ర కృషి చేస్తున్నారన్నారు.  గిరిజనులకు రాయితీ పై ఇచ్చే ఉపకరణాలు వినియోగించుకొని ఆర్థికాభివృద్ధి చెందాలన్నారు.

ఐ.టీ.డీ.ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ మాట్లాడుతూ ముందుగా ఆదివాసీ దినోత్సవ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 8 మండలాల ఉన్న గిరిజన లబ్ధిదారులకు 55 వేల పోడుపట్టాలు 40వేల   ఎకరలు అందించడం జరిగిందని ఇంకను 4వేల ఎకరాలు అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు ప్రణాళికలు రూపొందించడం జరుతుంది అన్నారు. కొఠియా గ్రామాలలో గిరిజన రైతులకు పట్టాలు అందించామన్నారు. పోడుపట్టాలు అందించడమే కాదు వారికి రైతు భరోసా అందించడం జరిగిందన్నారు.

అంతే కాకుండా 10వేల ఎకరాలలో ఉద్యాన పంటల అభివృధి, గిరిజన రైతులు ఆర్థికంగా అభివృధి చెందాలనే లక్ష్యంతో  జీడి మామిడి మొక్కలు అందించడం జరిగింది అన్నారు.  రోడ్డు కనెక్టివిటీ లేని 173 గ్రామాలను గుర్తించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద రోడ్డు నిర్మాణ పనులకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని త్వరలోనే పనులు చేపట్టడం జరుగుతుంది అన్నారు. గిరిజన గ్రామాలలో గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామన్నారు, గిరిజన యువతీ, యువకులకు ఉపాధి హామీ కల్పిస్తామన్నారు.

 పార్వతీపురం సబ్ కలెక్టర్ భావన కార్యక్రమానికి హాజరైన అందరికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నాకు గిరిజన ప్రాంతంలో పోస్టింగ్ దొరకడం ఆనందంగా ఉంది. గిరిజన ప్రాంతాలు, గిరిజనులు అభివృధి చెందుతున్నారని ఇంకా అభివృధి చెందాలని అభివృద్ధిలో భాగస్వామ్యమై అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో కరోనా నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు నిమిత్తం వాల్ పోస్టర్ లు కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో   గిరిజన సంఘాల నాయకులు ఆతిధులను సన్మానించారు,  గిరిజన సంఘాల నాయకులు

మంచాల పారమ్మ, కోలక గౌరమ్మ, బిడ్డిక తమ్మయ్య, పల్ల సురేష్, ఆరిక.చంద్రశేఖర్, దుక్క సీతారాం, తాడంగి సాయి, జన్ని మణికుమార్, పాలవలస భగవాన్, మంచాల ఈశ్వరరావు, ప్రభాకర్ రావు, జయసింహా, గంగరాజు, సింహాచలం, జగ్గయ్య పాల్గొన్నారు.

ఎం భరత్ కుమార్, సత్యం న్యూస్, విజయనగరం

Related posts

అమర్ నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 1 నుంచి

Satyam NEWS

గంజాయి సాగు లేదు….కానీ స‌ర‌ఫ‌రాకు యువ‌కుల‌ను వాడుకుంటున్నారు….!

Satyam NEWS

హరిత సిక్కోల్ జిల్లా ఏర్పాటు వాకర్స్ లక్ష్యం

Satyam NEWS

Leave a Comment