40.2 C
Hyderabad
April 26, 2024 13: 13 PM
Slider ప్రత్యేకం

రఘురామ ఎఫెక్ట్: ఏపీ సీఐడి చీఫ్ పై చర్యలకు కేంద్రం ఆదేశం

#amithsha

ఆంధ్రప్రదేశ్ సీఐడి అదనపు డీజీ సునీల్ కుమార్ పై తదుపరి చర్యలు తీసుకోవడానికి కేంద్రం ఒక అడుగు ముందుకు వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయనపై చర్యలకు ఉపక్రమించింది.

దాంతో ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లు స్పష్టం అవుతున్నది. పి వి సునీల్ కుమార్ 1993 బ్యాచ్ కి చెందిన ఐపిఎస్ అధికారి. ఆయనపై ఆయన భార్య పి.అరుణ ఫిర్యాదు మేరకు వరకట్న నిరోధక చట్టం లోని సెక్షన్ 3, 4, ఐపిసి 498 ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు అయి ఉన్నది.

ఈ కేసుకు సంబంధించి తెలంగాణ సిఐడి పోలీసులు 13వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో చార్జి షీట్ దాఖలు చేసి ఉన్నారు. అయితే తెలంగాణ పోలీసులు తనను అరెస్టు చేయకుండా సునీల్ కుమార్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.

ఈ వివరాలన్నీ చెబుతూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కమార్ భల్లాకు రఘురామకృష్ణంరాజు గత నెల 28న ఒక లేఖ రాశారు. సునీల్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన తన లేఖలో కోరారు.

కేసు విచారణ ప్రారంభించేందుకు ఏ క్షణంలోనైనా అవకాశం ఉన్నందున సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని లేకపోతే ఆయన అత్యున్నత పదవిలో ఉన్నందున సాక్ష్యులను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని రఘురామకృష్ణంరాజు తన లేఖలో పేర్కొన్నారు.

అందువల్ల ఆయనను రాష్ట్రంలో ఉంచరాదని రఘురామకృష్ణంరాజు సూచించారు. ఎంపీ రఘురామరాజు ఫిర్యాదుపై కేంద్రం స్పందించింది. ఎంపీ రఘురామరాజు ఫిర్యాదు లేఖను ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌కు కేంద్రం పంపింది. లేఖలోని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

దీనిపై ఆదిత్యనాథ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఎంపి రఘురామకృష్ణంరాజును ఆయన పుట్టిన రోజునే హైదరాబాద్ లో అరెస్టు చేసి లాకప్ లో అత్యంత తీవ్రంగా హింసించినట్లు ఇప్పటికే సుప్రీంకోర్టు లో కేసు నడిచింది. ఇదంతా సునీల్ కుమార్ నేతృత్వంలోనే జరిగినట్లు రఘురామకృష్ణంరాజు గతంలోనే ఆరోపించారు.

సునీల్ కుమార్ హిందూ దేవతలను కించపరిచారనే ఫిర్యాదు కూడా మరొకటి కేంద్రానికి చేరింది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు రాసిన లేఖపై కేంద్రం స్పందించడం, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించడం చర్చనీయాంశం అయింది.

మూడు రోజుల కిందట రఘురామకృష్ణంరాజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలిసి దాదాపు అరగంట సేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించిన విషయం తెలిసిందే.

Related posts

కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం

Bhavani

సంజయ్ అరెస్ట్ ఓ కుట్ర

Murali Krishna

ఫిర్యాదులు లేని ఎన్నికల కౌంటింగ్

Bhavani

Leave a Comment