40.2 C
Hyderabad
April 26, 2024 11: 38 AM
Slider విజయనగరం

నడి రోడ్ పై బైఠాయించినట్టు ఆగిపోయిన ఆర్టీసీ బస్…!

#rtcbus

విజయనగరం లో వరుసగా ఐదో బస్సు… ఐదోసారి…!

విజయనగరం మయూరీ జంక్షన్…మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయం.. మాడు పగిలిపోయేలా ఎండ…నెత్తిన పిడుగు పడే లా భానుడి భగభగలతో కప్పు కుంటున్న దృశ్యాలు ఒ వైపు…. పనులు మీద బైక్స్ పై..ఆటోలలో..బస్సు లలో వెళుతున్న జనాలు ఒకవైపు.. అకస్మాత్తుగా పేద్ద శబ్దం… ఏమై ఉంటుందా..ఏం జరిగిందా అని శబ్దం వచ్చే వైపే అందరి దృష్టి. ఎదురు గా జంక్షన్ ఆర్టీసీ బస్ అకస్మాత్తుగా ఆగిపోయిన దృశ్యం… ఏమై ఉంటుందాని కాస్త నిశితంగా చూస్తే.. బస్ ఫ్రంట్ టైర్ పేలడంతో బస్సు ఒక్కసారిగా మయూరీ జంక్షన్ లో ఆగిపోయింది.

పైన మీరు చదివిన పైశీర్షిక నిజమే. వరుసగా ఐదోసారి… ఐదో ఆర్టీసీ బస్సు… నడి రోడ్ పై అకస్మాత్తుగా ఆగిపోయింది తాజాగా విజయనగరం మయూరీ జంక్షన్ వద్ద…ఆర్టీసీ బస్ స్టాండ్ కు కూతవేటు దూరంలో… విశాఖ రైల్వే స్టేషన్ కు వెళుతున్న ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్..అకస్మాత్తుగా.. నగరంలో ఎత్తు బ్రిడ్జి వద్ద టైర్ పేలిపోవడంతో బ్రిడ్జి ఎక్కతుండగా…అదీ సిగ్నల్ దాటుతుండగా ఒక్క సారి ఘటన జరగడంతో బస్సు లో ప్రయాణీకులతో పాటు చుట్టు పక్కల జంక్షన్ ప్రాంతం అంతా భయానక వాతావరణం నెలకొని ఉంది.

తీరా చూస్తే బస్సు ఫ్రంట్ టైర్ పంక్చర్ జరగడంతో ఒక్క సారి బస్సు రోడ్ మధ్యనే ఆగిపోయింది. వెంటనే ఆర్టీసీ మెకానిక్ సిబ్బంది వస్తున్న క్రమంలో ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ లే…స్టెశనీ మార్చే పనికి ఉపక్రమించడం విశేషం. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు… అప్రమత్తం అయి…ట్రాఫిక్ జామ్ కాకుండా… ఏఎస్ఐ నూకరాజు, హోమ్ గార్డ్ గోపాల్.. స్థానిక ట్రాఫిక్ కానిస్టేబుల్… అక్కడే ఉంటూ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.వెంటనే విజయనగరం ఆర్టీసీ సీనియర్ ఇన్ స్పెక్టర్ ధుర్యోధన్..ఘటనా స్థలికి వచ్చి… స్థానిక పరిస్థితులను చక్కదిద్దారు.తిరిగి బస్సు కు స్టెఫిని వేసి…బస్సు ను డిపోకు తరలించారు… ఆర్టీసీ ట్రాఫిక్ విభాగం.

Related posts

మేరీ మాత విగ్రహం ధ్వంసం

Satyam NEWS

ఇంటికో ఉద్యోగం ఏమైంది? నిరుద్యోగులారా ఆలోచించండి

Satyam NEWS

ఈద్గాకు ప్రారంభోత్సవం చేసిన మంత్రి ఆర్.కె.రోజా

Satyam NEWS

Leave a Comment