37.2 C
Hyderabad
April 21, 2024 17: 23 PM
Slider కృష్ణ

జగన్ రెడ్డిని ఓడిస్తేనే పంచాయితీలకు మనుగడ

#rajendraprasad

స్థానిక సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా 2 నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ- పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ కోరారు. కృష్ణా జిల్లా, మచిలీపట్నం సిటీ లో కలెక్టర్ కార్యాలయం ఎదుట “ధర్నా”  నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ ను కలిసి సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై 16 డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించడం జరిగింది.

“ఇది చాలా తీవ్రమైన నిర్ణయం అని మాకు తెలుసు కానీ మాకు మరో దారి లేక ఈ తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నాము. రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి మా నిధులు, అధికారాలను, విధులను దొంగిలించి వేసినారు. అవి తిరిగి ఇవ్వమని రాజకీయాలకు అతీతంగా, రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని పార్టీల  వైయస్సార్సీపి, టిడిపి, బిజెపి, జనసేన, సిపిఐ, సిపిఎం చివరకు అధికార పార్టీ వైఎస్ఆర్సిపి తో సహా మొదలగు పార్టీలకు చెందిన సర్పంచులు,ఎంపీటీసీలు,ఎంపీపీలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్స్,కార్పొరేటర్స్ గత మూడు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు, ఆందోళనలు,  పోరాటాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు” అని రాజేంద్రప్రసాద్ విమర్శించారు.

12,918 గ్రామాలలోని  3 కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, మేము స్థానిక ప్రజాప్రతినిధులం  ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయి, అసమర్థులుగా, చేతకాన్ని వాళ్ళలా మా గ్రామాల ప్రజల చేత తీవ్ర నిందలు పడ్డాము. కానీ తప్పు మాది కాదు – జగన్ ది” అని రాజేంద్రప్రసాద్ అన్నారు. ” అందుకే మళ్లీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పల్లెలు శిధిలమైపోయి, గ్రామీణ ప్రజలు నాశనమైపోతారని, స్థానిక ప్రజా ప్రతినిధులు అన్యాయమైపోతారని, అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్పడానికి, గ్రామీణ ప్రజలకు తగిన న్యాయం చేయడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ కఠిన నిర్ణయం ఈరోజున తీసుకోవడం జరిగిందని”  రాజేంద్రప్రసాద్ చెప్పారు.

” రెండు నెలల్లో జరగబోయే ఏపీ అసెంబ్లీ- పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ రెడ్డి ని, అధికార వైయస్సార్సీపి ప్రభుత్వాన్ని ఓడించడానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన ముఖ్యంగా అధికార పార్టీ అయిన వైయస్సార్సీపి పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు,జడ్పీటీసీలు,కౌన్సిలర్స్,కార్పొరేటర్స్ తీవ్రంగా కృషి చేయాలని, మన గ్రామాల, పట్టణ ప్రజలకు జగన్ గారు చేస్తున్న అన్యాయాన్ని సాక్షాదారాలతో సహా వివరించి చెప్పి జగన్ గారికి వ్యతిరేకంగా మన ప్రజలతో ఓటు వేయించి ఓడించాలని  “జగన్ ఓడితేనే – మన మనుగడ” అనే నినాదంతో అన్ని పార్టీల సర్పంచులు, ఎంపీటీసీలు,ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ ఈ రెండు నెలలు చిత్తశుద్ధితో పట్టుదలగా  తమ తమ గ్రామాలలో,  పట్టణాలలో పనిచేయాలని” రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో గోలి వసంత కుమార్ ఆధ్యక్షులు ఉమ్మడి కృష్ణా జిల్లా సర్పంచుల సంఘం, ముల్లంగి రామకృష్ణారెడ్డి గౌరవసలహాదారులు సర్పంచ్లసంఘం, గల్లా తిమ్మోతి రాష్ట్ర అధికార ప్రతినిధి సర్పంచ్ ల సంఘం, కాగిత గోపాలరావు రాష్ట్ర కార్యదర్శి సర్పంచుల సంఘం , ముప్పనేని రవి ప్రసాద్ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సర్పంచుల సంఘం , మండలి ఉదయ భాస్కర్ రాష్ట్ర కార్యదర్శి సర్పంచుల సంఘం, పంచకర్ల సురేష్ సర్పంచుల సంఘం నాయకులు, వంపు గడవల ఫ్రాన్సిస్ మర్రివాడ సర్పంచ్, తుమ్మలపల్లి శ్రీనివాసరావు సర్పంచులు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు , అంకం మారుతీ రావు సర్పంచ్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి క‌టాక్షం

Satyam NEWS

విదేశాల్లో యోగ విద్య విస్తరణకు కృషి

Satyam NEWS

ఏపీలో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా తెలంగాణ యువతి

Satyam NEWS

Leave a Comment