37.2 C
Hyderabad
April 26, 2024 21: 49 PM
Slider సంపాదకీయం

ఆంధ్రాపోలీసులు… తెలంగాణ పోలీసులు…ఒక డిఫరెన్స్

YSSharmila

ఆంధ్రాకు చెందిన వై ఎస్ షర్మిల తెలంగాణ వచ్చి రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. తెలంగాణ లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆంధ్రాలో రెండేళ్ల కిందటి వరకూ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంగా ఉంది.

151 సీట్లతో గెలిచిన వైసీపీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత అడుగడుగునా పోలీసు బారికేడ్లు దాటాల్సి వస్తున్నది. అయినదానికి కానిదానికి పోలీసు కేసులు ఎదుర్కోవాల్సి వస్తున్నది.

కరోనా చట్టం ప్రతిపక్షాలపై దారుణంగా ప్రయోగిస్తున్నారు. అధికార వైసీపీ నాయకులు యథేచ్ఛగా తిరుగుతూ పబ్లిక్ మీటింగ్ లు పెడుతున్నా చూసీ చూడటనట్లు వదిలేస్తున్న ఆంధ్రా పోలీసులు తెలుగుదేశం నాయకులు అదే పని చేస్తే మాత్రం కేసులు పెడుతున్నారు.

పాత కేసులు తిరగదోడుతున్నారు. కొత్త కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఎన్నో అభూతకల్పనలు ప్రచారం అవుతున్నా పట్టించుకోని ఆంధ్రాపోలీసులు తెలుగుదేశం పార్టీ పొరబాటున ఏ విషయాన్ని అయినా వైరల్ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

అమరావతి ఉద్యమాన్ని అణచివేశారు. విశాఖ ఉక్కు ఉద్యమం కనిపించకుండా చేశారు. దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని చెప్పిన తెలుగుదేశం, బిజెపి నాయకులపైనే ఆ కేసులు పెట్టారు.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చంద్రబాబునాయుడు ప్రసంగిస్తున్న సమయంలో రాళ్లు విసిరితే అలాంటిదేం లేదని పోలీసులు చెప్పేశారు. చెప్పడమే కాదు.. ఆధారాలు ఉంటే మీరే నిరూపించుకోండి అంటూ చేతులు దులుపుకున్నారు…

మరి తెలంగాణ లో..?

ఆంధ్రా నుంచి వచ్చి పార్టీ పెట్టిన షర్మిల నిరాహార దీక్ష చేస్తానంటే అనుమతించారు. మూడు రోజుల పాటు దీక్ష చేయడం వల్ల రాష్ట్రంలో ఆవేశకావేషాలు పెరుగుతాయని, పైగా హైదరాబాద్ లో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఒక రోజు దీక్షకు అనుమతిస్తామని చెప్పారు. అలానే చేశారు.

ఒక రోజు దీక్షకు అనుమతి పొంది దీక్ష కొనసాగిస్తామంటే అడ్డుకున్నారు. చెప్పినా వినకపోవడంతో అరెస్టు చేస్తామన్నారు. దాదాపు రెండు గంటల సేపు బతిమిలాడారు. తర్వాత అరెస్టు చేసి లోటస్ పాండ్ కు తరలించారు.

ఇందులో ఎక్కడా అన్యాయం లేదు… అక్రమం లేదు…. అయినా పోలీసులే తమపై దాడి చేశారని షర్మిల అనుచరులు నానాగొడవ చేశారు. ‘‘చెట్టుమీది కొంగ కేసీఆర్ దొంగ’’ అంటూ ఆంధ్రా టైప్ నినాదాలు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.

అదే ఆంధ్రాలో ముఖ్యమంత్రి మంత్రి జగన్ పై ఈగవాలితే కేసులు పెడుతున్నారు. తెలంగాణ పోలీసుల్ని తిడుతున్న షర్మిల తాను పుట్టిన ఆంధ్రాలో తన సొంత అన్న చేతిలో ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారో ఒక్క సారి చూసి వస్తే బాగుంటుంది….

ఇప్పటి వరకూ జరుగుతున్నది తెలియకపోతే…  

Related posts

నాటి మంత్రుల శిలాఫలకాలు..నేటి మంత్రుల ప్రారంభోత్సవాలు…

Satyam NEWS

“ఒక్కసారి ప్రేమించాక” ఒక్కసారయినా చూసి తీరాల్సిందే!

Satyam NEWS

త్వరలో తండ్రి కాబోతున్న భల్లాల దేవుడు

Satyam NEWS

Leave a Comment