35.2 C
Hyderabad
April 27, 2024 13: 54 PM
Slider సంపాదకీయం

జగన్ కు చుక్కలు చూపించేందుకు చంద్రబాబు సిద్ధం

#chandrababu

రాజమండ్రి కేంద్ర కారాగారంలో తీవ్ర అస్వస్థతకు గురైన మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పూర్తి స్థాయి బెయిల్ పై వచ్చిన అనంతరం దేవాలయాల సందర్శనకు వెళుతున్నారు. తిరుమల నుంచి తన యాత్రను ప్రారంభించిన ఆయన రాష్ట్రంలోని అన్ని ప్రముఖ క్షేత్రాలను దర్శించనున్నారు. ఈ యాత్ర పూర్తి అయిన తర్వాత నుంచి ఆయన తన పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించనున్నారు.

శుక్రవారం తిరుమలలో స్వామి వారి దర్శనం చేసుకుని అమరావతి చేరుకున్నారు.

శనివారం విజయవాడ కనకదుర్గమ్మను చంద్రబాబు కుటుంబ సమేతంగా దర్శించుకుని మెుక్కులు చెల్లించుకుంటారు. డిసెంబర్ 3న విశాఖపట్నం వెళ్లనున్నారు. అదే రోజు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 5న శ్రీశైలం మల్లన్నను చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో సహా దర్శించుకుంటారు.

ఆధారాలు లేని స్కిల్ కేసులో ఏకంగా 52 రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు అయ్యింది. ఈ బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కోర్టు ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు.

క్వాష్ పిటిషన్ తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే.. ఆయన పై పెట్టిన కేసులన్నీ అక్రమం అని తేలుతాయి. కోర్టుల్లో ఉన్నవన్నీ తేలిపోతాయి. వాటికి విచారణ అర్హత కూడా ఉండదు.

ఒక వేళ చంద్రబాబుకు 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు చెబితే మాత్రం.. అన్ని కేసుల్లో విచారణలు దాదాపుగా పూర్తయినందున.. తీర్పులు వెల్లడించాల్సి ఉంటుంది. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో చంద్రబాబును రాజకీయానికి దూరం చేయాలనుకుంటున్న జగన్ రెడ్డి పన్నాగాలు వర్కవుట్ అవుతాయా లేదా అన్న క్వాష్ పిటిషన్ పై తీర్పును బట్టి వెల్లడయ్యే అవకాశం ఉంది.

Related posts

ఖమ్మంలో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

Bhavani

కొల్లాపూర్ సీఐగా యాలాద్రి: వనపర్తికి వెంకట్ రెడ్డి బదిలీ

Satyam NEWS

కిమ్స్ హాస్పిటల్ లో ఉచిత కంటి పరీక్షలు

Satyam NEWS

Leave a Comment