40.2 C
Hyderabad
April 26, 2024 14: 58 PM
Slider ప్రత్యేకం

రేషన్‌ డోర్‌ డెలివరీకి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

#APHighCourt

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ డోర్‌ డెలివరీకి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ రేషన్ డోర్ డెలివరీ జరగనుంది.

రేషన్ వాహనాల రంగు మార్చాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది.

‘ఇంటింటికీ రేషన్‌’ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అడ్డుకోకుండా ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే.

ఎస్‌ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ వ్యాజ్యం దాఖలు చేశారు. మార్చి 15 వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని కోర్టు తెలిపింది.

తదుపరి విచారణ మార్చి 15కు వాయిదా వేసింది. హైకోర్టు తాజా ఆదేశాలతో వెంటనే రేషన్ డోర్ డెలివరీకి పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది.

జిల్లాల్లో ఏర్పాట్లపై  ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.

Related posts

అధికారులు వేధిస్తున్నారని వైసీపీ కార్పొరేటర్ ధర్నా

Satyam NEWS

వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపుపై చట్ట సవరణ వద్దు

Satyam NEWS

వైభవంగా నల్లకుంట గణేష్ నిమజ్జన కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment