31.2 C
Hyderabad
February 14, 2025 19: 29 PM
Slider ప్రత్యేకం

ఎన్నికల సంఘం అంటే ఏమిటో ఇప్పుడు తెలిసిందా?

supreme court

సుప్రీంకోర్టు తీర్పు చూసిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం అంటే ఏమిటో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అర్ధం అయి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని కులం పేరుతో దారుణంగా దూషించిన ముఖ్యమంత్రి, మరొక అడుగు ముందుకు వేసి ఈ రాష్ట్రానికి నేనా ముఖ్యమంత్రి ఆయనా అని కూడా ప్రశ్నించారు.

151 స్థానాలు ఇచ్చిన ప్రజల తీర్పును ఎన్నికల సంఘం అధికారి కాలరాస్తున్నారని ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని కూడా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ తో ఆయన ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాయించారు.

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను ఉపసంహరించుకోవాలంటూ ఆమె తన లేఖలో పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభిప్రాయం తీసుకోకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం ఎలా తీసుకుంటుందని కూడా ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

తక్షణమే మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్ రెడ్డిని పిలిచి అభిప్రాయం కూడా తీసుకున్నారు. అంతటితో ఆగకుండా సుప్రీంకోర్టుకు వెళ్లారు. వాదోపవాదనలు విన్నతర్వాత సుప్రీంకోర్టు ఎన్నికల వాయిదా అంశంలో జోక్యం చేసుకోవడానికి అంగీకరించలేదు.

ఇక సత్యం న్యూస్ తన విశ్లేషణలో ముందే చెప్పినట్లు నిరవధికంగా ఎన్నికల కోడ్ ను కొనసాగించడం పై మాత్రమే సుప్రీం కోర్టు స్పందించింది. సత్యం న్యూస్ తన విశ్లేషణలో రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన తప్పిదాన్ని ఎత్తి చూపిన విషయం తెలిసిందే.

ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్ ను ఎత్తేసి ఉండాల్సిందని సత్యం న్యూస్ తన విశ్లేషణలో అభిప్రాయపడిన విషయం తెలిసిందే. దాదాపుగా అవే లైన్స్ లో సుప్రీం కోర్టు కూడా తీర్పుచెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటనను సవాల్ చేస్తూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

దీనిపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్థించింది. వాయిదాను కొనసాగించాలని తెలిపింది. కరోనా విజృంభణ నేపథ్యంలో తమ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికల కోడ్‌ ఎత్తివేయాలని సుప్రీంకోర్టు సూచించింది.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని తెలిపింది. ఈ పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్లు పేర్కొంది.

Related posts

బాలికపై రేప్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష

Sub Editor

ఎనిమిది రూట్ లలో అమెరికాకు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు

Satyam NEWS

ధరణి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నూతన కలెక్టర్లు సమర్థవంతంగా నిర్వర్తించాలి

Satyam NEWS

Leave a Comment